Begin typing your search above and press return to search.

మ‌హేష్ పెళ్లి సీక్రెట్ అడిగి ఇరుకున పెట్టిన బాల‌య్య‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 11:49 AM GMT
మ‌హేష్ పెళ్లి సీక్రెట్ అడిగి ఇరుకున పెట్టిన బాల‌య్య‌
X
నంద‌మూరి న‌ట‌సింహం మాంచి జోష్ మీదున్నారు. చాలా కాలం త‌రువాత `అఖండ‌`తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన బాల‌కృష్ణ అదే జోష్‌తో తొలి సారి `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` టాక్ షోని వైర‌ల్ చేస్తున్నారు. తొలి సారి `ఆహా` ఓటీటీ కోసం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా మారి టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో ప్ర‌త్యేక చిట్ చాట్ ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాప‌బుల్ తాజా సీజ‌న్ త్వ‌ర‌లో ఎండ్ కాబోతోంది.

ఫైన‌ల్ ఎపిసోడ్ లో సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు అతిథిగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ ఎపిసోడ్ తో ఈ సీజ‌న్ ఎండ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 4న మ‌హేష్ బాబు పాల్గొన్న ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇంత‌కు ముందే ఈ ఫైన‌ల్ సీజ‌న్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసిన `ఆహా` టీమ్ తాజాగా గురువారం మ‌రో ప్రోమోని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.

ముందు నుంచి ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ మ‌రింత ప్ర‌త్యేకంగా వుంటుంద‌ని ప్రేక్ష‌కుల‌తో పాటు మ‌హేష్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రోమో ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. తాజాగా విడుద‌ల చేసిన మ‌రో ప్రోమో కూడా బాల‌య్య‌, మ‌హేష్ ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగిన‌ట్టుగా తెలియ‌జేయ‌డంతో తాజా ఎపిసోడ్ పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. స్టేజ్ పైకి మ‌హేష్ ఎంట్రీ ఇవ్వ‌డం.. ఎదురుగా వెళ్లి బాల‌కృష్ణ .. మ‌హేష్ ని ఆలింగ‌నం చేసుకోవ‌డంతో ప్రోమో మొద‌లైంది.

`ఇంత యంగ్ గా వున్నావేంట‌య్యా బాబూ.. అని బాల‌కృష్ణ ఆశ్చ‌ర్యంగా అడ‌గ‌డం... మ‌హేష్ సిగ్గుప‌డుతూ న‌వ్వ‌డం.. ఆ త‌రువాత మ‌హేష్ నాదో చిన్న కోరిక‌.. నా డైలాగ్ నీ గొంతులో వినాల‌ని వుంది.. అని బాల‌కృష్ణ అడ‌గ‌డం... `మీ డైలాగ్ మీరు త‌ప్ప ఇంకెవ‌రూ చెప్ప‌లేరు సార్` అని మ‌హేష్ చెప్ప‌డం.. క‌వ‌ర్ చేస్తున్నావ్ అని బాల‌య్య పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

చిన్న‌ప్పుడు నువ్వు నాటీ కిడ్ వ‌ని వున్నాను.. అంటే మ‌హేష్ సిగ్గుప‌డుతూ న‌వ్వేయ‌డం.. చేసేవ‌న్నీ చేస్తావ్‌.. చెప్ప‌మంటే సిగ్గుప‌డ‌తావ్‌.. అని బాల‌య్య కౌంట‌ర్ వేయ‌డం.. నెంబ‌ర్ వ‌న్ స్టార్ .. సూప‌ర్ స్టార్ అయిపోయావ్‌..స‌డ‌న్‌గా ఒక మూడేళ్లు గ్యాప్ తీసుకున్నావ్‌... ఎందుకు తీసుకున్నావ్‌? అని బాల‌య్య అడిగారు... దానికి ` బేసిగ్గా మూడేళ్లు న‌న్ను నేను క‌రెక్ట్ చేసుకోవ‌డానికి తీసుకున్నాను. అన్నాడు మ‌హేష్‌.. ఫైన‌ల్ గా ప్రోమో చివ‌ర్లో త‌న‌దైన స్టైల్లో మ‌హేష్ పై పంచ్ వేశారు బాల‌య్య‌.. `వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్ .. ఏంటంట సీక్రెట్‌..? అని పంచ్ వేయ‌గానే .. ఏంటా ప్ర‌శ్న అన్న‌ట్టుగా మ‌హేష్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన తీరు ఈ ఎపిసోడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర‌హాలో పేల‌బోతోంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఆహాలో ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ కానుంది.