Begin typing your search above and press return to search.

కేసీఆర్ పైనా యాదాద్రి పైనా NBK ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   27 Dec 2021 11:50 AM GMT
కేసీఆర్ పైనా యాదాద్రి పైనా NBK ప్ర‌శంస‌లు
X
న‌ట‌సింహా నందమూరి బాల‌కృష్ణ కెరీర్ బెస్ట్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అఖండ చిత్రం సింహా - లెజెండ్ ల‌ను మించి బంప‌ర్ హిట్ కొట్టింది. ఎన్.బి.కే కెరీర్ లోనే వంద కోట్ల క్ల‌బ్ చిత్ర‌మిది. ఈ సినిమా విడుద‌లై 25వ రోజు కూడా అద్భుత వ‌సూళ్లను సాధించింది. బాల‌య్య జోరుకు అడ్డుక‌ట్ట‌ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అఖండ చిత్రం బాల‌య్య‌తో పాటు బోయ‌పాటి కి కీల‌క మ‌లుపునిచ్చిన చిత్రంగా భావించాలి. పుష్ప‌.. శ్యామ్ సింగ‌రాయ్ లాంటి క్రేజీ చిత్రాలు విడుద‌లైనా కానీ అఖండ జోరు మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం టీమ్ లో ఉల్లాసం పెంచుతోంది. ఘ‌న విజ‌యాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. బాల‌య్య స‌హా అఖండ టీమ్ తాజాగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు.

యాదాద్రి న‌ర‌సింహ స్వామిని సంద‌ర్శించిన అనంత‌రం యాదాద్రి పైనా.. సీఎం కేసీఆర్ పైనా ఎన్.బి.కే ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి సామి వారి ఆల‌యాన్ని పున‌ర్మించిన విధానం ఆర్కిటెక్చ‌ర్ పార్కుల సౌంద‌ర్యం త‌న‌ని మంత్ర ముగ్ధుడిని చేసింద‌ని ఆయ‌న పొగ‌డ్త‌లు చెబుతున్నాయి.

బాలకృష్ణ మాట్లాడుతూ ``ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జ‌రిగింది. హిస్ట‌రీలో నిలిచిపోయేలా దేవాల‌యాన్ని తీర్చిదిద్దారు. సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రలను దర్శిస్తూ..యాదాద్రిని దర్శించుకున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉంది`` అంటూ సీఎం కేసీఆర్ ని ప్రశంసించారు. అలాగే యాదాద్రి ప‌రిస‌రాల్ని క‌లుషితం చేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఎన్.బి.కే ప్ర‌భుత్వానికి సూచించారు. పుణ్య‌క్షేత్రం ప‌విత్ర‌త‌ను కాపాడాల‌ని ఆకాంక్షించారు.