Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ ని ప్ర‌శ్నించిన‌ NBK

By:  Tupaki Desk   |   28 Dec 2022 4:17 AM GMT
టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ ని ప్ర‌శ్నించిన‌ NBK
X
ఆహా-అన్ స్టాప‌బుల్ లో బాల‌కృష్ణ ఎదుట ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఈ దృశ్యం చాలా అరుదైన‌ది. కానీ ఈ అరుదైన దృశ్యం సాధ్య‌మైంది. ఆహా వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ - బాల‌య్య న‌డుమ రాజ‌కీయాల‌పై చ‌ర్చ సాగింది. టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ ని ఈ వేదిక‌పై బాల‌య్య‌ ప్ర‌శ్నించారు. 2014 టీడీపీ-జ‌న‌సేన‌ పొత్తు ఎందుకు రిపీట్ కాకూడ‌దు? అని ఎన్.బి.కే సూటిగా ప్ర‌శ్నించారని తెలిసింది.

ముఖ్య‌మంత్రిగా త‌న‌ను తాను ముందే ప్ర‌క‌టించుకుంటే ఇక పొత్తులు ఎలా సాధ్యం అంటూ ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ఇలా రాజ‌కీయాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌తో అన్ స్టాప‌బుల్ షోని బాల‌య్య‌ హోరెత్తించారు.

ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్ష ఓట్లు చీల‌నివ్వ‌న‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల అంత‌ర్య‌మేమిటి? అంటూ బాల‌కృష్ణ ప్ర‌శ్నించారని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఆహా- అన్ స్టాప‌బుల్ షోని చిత్రీక‌రించ‌గా అక్క‌డికి భారీ ఎత్తున ఇరువురు హీరోల‌ అభిమానులు చేరుకున్నారు. తాజాగా ప‌వ‌న్ వ‌ర్సెస్ బాల‌కృష్ణ ఎపిసోడ్ సంచ‌ల‌నంగా మార‌నుంద‌ని తెలుస్తోంది.

చిరంజీవి నాగ‌బాబు ప‌వ‌న్ మధ్య ఉన్న వ్య‌క్తిగ‌త విభేధాల‌ గురించి బాల‌య్య నేరుగా ప‌వ‌న్ ని ప్ర‌శ్నించారు. లోకానికి తెల‌వ‌ని ప‌వ‌న్ కల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితంపైనా బాల‌కృష్ణ ప్రశ్నించారు. మొత్తానికి ఆహా-అన్ స్టాప‌బుల్ షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌-బాల‌కృష్ణ ఎపిసోడ్ సంచ‌ల‌నం సృష్టించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అలాగే ఈ షో రాజ‌కీయంగా ర‌చ్చ‌ర‌చ్చ‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అలాగే బాల‌య్య అభిమానులు వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వీరంగం ఒక లెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన వార్ ని ఇది స‌రికొత్త లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు.

ముఖ్యంగా పొత్తు గురించి ప‌బ్లిక్ వేదిక‌పై బాల‌కృష్ణ జ‌న‌సేనానిని నేరుగా ప్ర‌శ్నించ‌డంతో అది కాస్తా రాజ‌కీయంగా వేడి పెంచ‌నుంది. ఆహా అన్ స్టాప‌బుల్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎపిసోడ్ టీఆర్పీల‌ను పీక్స్ కి తీసుకెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.