Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్‌ సీజన్‌ 2 కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా..?

By:  Tupaki Desk   |   7 Jun 2022 8:21 AM GMT
అన్ స్టాపబుల్‌ సీజన్‌ 2 కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా..?
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా అనగానే అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆహా వారు బాలయ్య హోస్ట్‌ గా అన్ స్టాపబుల్‌ ను మొదలు పెట్టడం.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అల్లు అరవింద్ ఆలోచనకు ప్రతిరూపం అయిన బాలయ్య అన్‌ స్టాపబుల్ షో సీజన్‌ కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సీజన్ 2 ఉంటుందని అప్పుడే ఆహా వారు మరియు బాలయ్య ప్రకటించారు.

అన్ స్టాపబుల్‌ షో కోసం బాలయ్య కూడా ఎదురు చూస్తున్నట్లుగా మధ్య ఒక సందర్భంగా చెప్పుకొచ్చారు. సీజన్‌ 1 మరియు సీజన్ 2 కు మద్య కనీసం 10 నెలల నుండి సంవత్సరం వరకు గ్యాప్‌ ఉండాలి. గత ఏడాది అక్టోబర్ లో అన్‌ స్టాపబుల్‌ సందడి మొదలు అయ్యింది. ఏడాది కావడానికి ఇంకాస్త సమయం ఉంది. అంటే ఈ ఏడాది చివర్లో కాని అన్‌ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం అవ్వకపోవచ్చు.

కాని నందమూరి అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాత్రం ఇంకా ఎప్పుడు అన్ స్టాపబుల్‌ సీజన్ 2 అంటూ చర్చ మొదలు పెట్టారు. కనీసం ఏడాది కూడా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్‌ అన్నట్లుగా అయిదు ఆరు నెలలకే కక్కుర్తితో మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని.. అందుకే కాస్త స్లోగానే అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 ను మొదలు పెట్టే ఉద్దేశ్యంతో ఆహా టీమ్‌ వారు ఉన్నారు.

అన్ స్టాపబుల్‌ షో ప్రారంభం కాకున్నా కూడా అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం కొనసాగుతూనే ఉందట.వచ్చే సీజన్ లో బాలయ్య ముందు గెస్ట్‌ లుగా ఎవరిని కూర్చోబెట్టాలి.. వారిని ఎలాంటి ప్రశ్నలు వేయాలి..వారితో ఎలాంటి ఆటలు ఆడిస్తే బాగుంటుంది అనే విషయాలను ముందస్తు ప్లాన్‌ ప్రకారం స్క్రిప్ట్‌ రెడీ చేసుకుంటూనే ఉన్నారు. కనుక ఆహా లో అన్ స్టాపబుల్‌ సీజన్ 2 మొదలు అవ్వడానికి మరి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

ఈ లోపు బాలయ్య తన 107వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను కూడా చేయాల్సి ఉంది. హీరోగా బాలయ్య స్టార్‌ డమ్‌ ను క్రేజ్ ను అన్ స్టాపబుల్‌ మరింతగా పెంచింది.

ఇప్పటి వరకు వెండి తెరపై చూసిన బాలయ్య ను ఆహా ఓటీటీ లో చూస్తూ ఉంటే సరికొత్తగా అనిపిస్తుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే బాలయ్య అన్‌ స్టాపబుల్‌ మళ్లీ మళ్లీ వస్తూనే సీజన్ లు సీజన్ లుగా రాబోతుంది.