Begin typing your search above and press return to search.
#NBK108 ఛాన్స్ ఆ క్రేజీ డైరెక్టర్ కే సుమీ
By: Tupaki Desk | 25 July 2021 12:18 PM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 106 వ చిత్రం `అఖండ` బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `సింహా`- `లెజెండ్` తరహాలో ఈ కాంబినేషన్ లో వస్తోన్న మరో భారీ మాస్ ఎంటర్ టైనర్ ఇది . పక్కా బోయపాటి శైలి యాక్షన్ సినిమా. ఇప్పటికే ఆన్ సెట్స్ నుంచి లీకైన బాలకృష్ణ స్టిల్స్ అభిమానుల్లో అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇక టీజర్..ట్రైలర్ రిలీజ్ అనంతరం ఆ అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ 107వ చిత్రం గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది.
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ ఎంటర్ టైనర్ ని గోపిచంద్ తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. `అఖండ` షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. అయితే ఈ రెండు సినిమాల రీలీజ్ కు ముందే బాలయ్య 108వ చిత్రాన్ని కూడా లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. `పటాస్`- `ఎఫ్-2`- `సరిలేరు నీకెవ్వురు` చిత్రాలతో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే బాలయ్య కు లైన్ వినిపించి లాక్ చేసినట్లు సమాచారం. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు మాస్ అంశాలున్న కథలోనే తనదైన శైలి కామెడీ ని హైలైట్ చేస్తూ ఎంటర్ టైనర్ ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇది బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావాల్సి ఉంది. అయితే బాలయ్య అభిమానులను మెప్పించే మాసీ కామెడీ ట్రీట్ ని రెడీ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
పూరి తెరకెక్కించిన `పైసా వసూల్` తర్వాతే అనీల్ రావిపూడితో బాలయ్య సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ అప్పుడు వీలు పడలేదు. తాజాగా అనీల్ క్రేజీ దర్శకుడిగా రాణించడంతో బాలయ్య సందేహాలు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సాహు గారపాటి- హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.
ఎన్.బి.కె 109 మాత్రం పైసా వసూల్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఉంటుందని ఇంతకుముందు బాలయ్య కన్ఫామ్ చేశారు. ఆసక్తికరంగా ఆదిత్య 369 సీక్వెల్లోనూ బాలయ్య నటిస్తారు. అందులో మోక్షజ్ఞ కథానాయకుడు కాగా బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. బహుశా ఈ చిత్రం మోక్షజ్ఞకు మొదటి చిత్రం కాగా.. ఎన్బీకే 110వ చిత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య 369 చిత్రం ఈ ఏడాదితో 30సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్వయంగా క్రేజీ సీక్వెల్ ని కన్ఫామ్ చేశారు. ఎన్బీకే వరుసగా ముగ్గురు దర్శకులను ఫైనల్ చేయగా ఆదిత్య 369 సీక్వెల్ కి దర్శకుడిని ఫైనల్ చేయాల్సి ఉంది.