Begin typing your search above and press return to search.
NBK108 ఫస్ట్ లుక్ పోస్టర్.. హిట్టు బొమ్మ..!
By: Tupaki Desk | 22 March 2023 10:54 AM GMTఅఖండ, వీర సింహా రెడ్డి రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమా సెట్స్ మీద ఉంది. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ నందమూరి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. బాలకృష్ణ ఫస్ట్ లుక్ అయితే అరుపులు పెట్టించేలా ఉంది. దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్ అని మీరు ఎన్ని ఊహించికున్న అంతకుమించేలా ఈ సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే చెప్పేశాడు అనీల్ రావిపుడి.
పటాస్ నుంచి F3 వరకు డైరెక్టర్ గా తను ఎప్పుడూ ఫెయిల్ అవని అనీల్ రావిపుడి ఫస్ట్ టైం ఒక పక్కా మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉంచుతూనే తన మార్క్ కామెడీని కూడా మిక్స్ చేస్తాడని తెలుస్తుంది.
సినిమా ఫస్ట్ లుక్ తోనే నందమూరి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు అనీల్ రావిపుడి. ఇక సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో బాలయ్యని ఓ రేంజ్ లో చూపించబోతున్నాడు అనీల్ రావిపుడి.
స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన అనీల్ రావిపుడి ఒక అభిమాని ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా బాలకృష్ణని చూపించాలని ఫిక్స్ అయ్యారు. ఎన్.బి.కె 108 సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
శ్రీలీల కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడట అనీల్ రావిపుడి. అఖండ, వీర సింహా రెడ్డి హిట్ మేనియాను ఈ సినిమాతో కూడా కొనసాగించాలని చూస్తున్నారు బాలకృష్ణ.
ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి మించే ఈ సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే చెప్పకనే చెప్పాడు అనీల్ రావిపుడి. మరి NBK108 ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.