Begin typing your search above and press return to search.

NBK108 స్టోరీ లైన్‌.. ఇంట్రెస్టింగ్‌ గాసిప్స్‌

By:  Tupaki Desk   |   28 Feb 2023 5:58 PM IST
NBK108 స్టోరీ లైన్‌.. ఇంట్రెస్టింగ్‌ గాసిప్స్‌
X
బాలకృష్ణ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లను దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. ఈ సినిమా లో బాలకృష్ణ ను నెవ్వర్ బిఫోర్‌ అన్నట్లుగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా బలంగా చెబుతున్నాడు.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న పుకార్ల అనుసారంగా బాలకృష్ణ 108వ సినిమా లో బాలయ్య 60+ వయసు వ్యక్తి గా కనిపించబోతున్నాడట. గెటప్ విషయంలో కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా బాలయ్య సర్‌ ప్రైజ్ చేయడం ఖాయం అన్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఇక కథ గురించి ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్నాయి.. మూడు పదుల వయసులో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉండే హీరో ఒక కేసులో ఏకంగా 14 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. జైలుకు వెళ్లక ముందు భార్య ఒక బిడ్డ కూడా ఉంటారు. జైలు నుండి బయటకు వచ్చిన హీరో ఆరు పదుల వయసులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది.

రెండు విభిన్నమైన లుక్స్ లో బాలయ్య ను అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దసరా వరకు ఎట్టిపరిస్థితుల్లో సినిమాను విడుదల చేయాలని బాలయ్య ఇప్పటికే దర్శకుడు అనిల్‌ రావిపూడికి స్ట్రాంగ్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది.

సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి ఎలాంటి అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్స్ రావడం లేదు.. అయినా కూడా పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. ఈ సినిమా తో బాలయ్య హ్యాట్రిక్ కొట్టేనా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.