Begin typing your search above and press return to search.
2017 డ్రగ్ చాట్స్ డీకోడ్ చేసేందుకు NCB యాక్సెస్ ఇలా!
By: Tupaki Desk | 23 Sep 2020 5:30 AM GMTబాలీవుడ్ లో డ్రగ్స్ క్రయవిక్రయాలు.. ఓన్లీ కోడ్ లాంగ్వేజ్ లోనే సాగుతాయి. స్టార్లతో మేనేజర్లు పెడ్లర్లు కుమ్మక్కయ్యి ఈ వ్యవహారాన్ని గుట్టు లీకవ్వకుండా నడిపిస్తారని రుజువవుతోంది. అయితే ఎన్.సి.బి విచారణలో చిక్కి బాలీవుడ్ మాఫియాలు గిజగిజలాడిపోతున్నాయి. ఇందులో స్టార్లతో పాటు మేనేజర్లు పెడ్లర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక పెడ్లర్లు లేదా మేనేజర్లతో స్టార్ల చాటింగులు ఎలా ఉండేవి? వీళ్లు ఉపయోగించే కోడ్ లాంగ్వేజ్ ఎలా ఉండేది? అన్నది తెలుసుకునే కొద్దీ విస్మయపరుస్తోంది. నటి 'డి' (తరువాత దీపికా పదుకొనే అని నిర్ధారించబడింది) అలాగే `కె` అక్షరాలతో వాట్సాప్ చాట్ లను ఎన్.సి.బి యాక్సెస్ చేసిందని దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ అని నిర్ధారించారు. వీరిద్దరూ జయ సాహాతో కలిసి వాట్సాప్ గ్రూపులో భాగమయ్యారు. ఔషధాల(డ్రగ్స్)ను సమన్వయం చేయడానికి వీరు చాటింగులు ఉపయోగించారు. అది కూడా కోడ్ లాంగ్వేజ్ తో.
యాక్సెస్ చేసిన చాట్ లు పరిశీలిస్తే.. దీపిక కోకో క్లబ్ పార్టీలో చాలా విషయాలు బయటపడ్డాయి. అక్టోబర్ 2017 నుండి ఇవి బయటపడ్డాయి. `కె` నుండి ``మాల్`` ను అడుగుతున్నట్లు చూపించే చాట్.. అది ఉందని రిప్లయ్ రావడం బయటపడింది. ఇంకా `కె` ఆమె కోరుకుంటే `అమిత్` ను అడగవచ్చు అని .. ``అతను తీసుకువెళుతున్నాడు`` అని మరో చాటింగ్ బయటపడింది. ఇద్దరూ లాజిస్టిక్స్ గురించి చర్చించినందున ఆమెకు `హాష్` అవసరమని మరియు `కలుపు` కాదని `డి` స్పష్టం చేసిన చాట్ లభించింది. ఆ తరువాత మరొక సంభాషణల తెరపైకి వచ్చింది. అక్కడ జయ సాహా మరొ ఇద్దరు స్టార్లు `ఎస్` మరియు `ఎన్` కు డ్రగ్స్ అందించడం గురించి చర్చ సాగింది.
బాలీవుడ్ మాదకద్రవ్యాల సంబంధాలపై ఎన్.సిబి దర్యాప్తు పరంగా ఓ రెండు కోణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-రియా చక్రవర్తి అనుబంధ కోణం గురించి.. అలాగే 2019 బాలీవుడ్ పార్టీ వీడియో గురించి మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు కోణంలో ఎన్.సిబి దర్యాప్తు చేస్తుంటే అందులో చాలా మంది బాలీవుడ్ తారల పేర్లు బయటపడుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలతో లింకులు బయటికి వస్తున్నాయి.