Begin typing your search above and press return to search.
ముంబై డ్రగ్స్ దాడులలో అరెస్ట్ అయిన టాలీవుడ్ యువనటి..!!
By: Tupaki Desk | 3 Jan 2021 1:53 PM GMTసినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అప్పుడప్పుడు తప్పు దారిపడుతూ ఉంటారు. కొందరికి సినిమాలు లేకపోవడం కారణమైతే.. మరి కొందరికి స్నేహం, పరిచయాలు లేదా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలనే పిచ్చి ఆలోచనలతో డ్రగ్స్ మాఫియాలో అడుగు పెడుతుంటారు. నటినటులు డ్రగ్స్ లో ఇరుక్కుని జీవితాలు - కెరీర్లు నాశనం చేసుకునే సంఘటనలు ఎక్కువగా మనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంటాయి. అలా అని టాలీవుడ్ ఇండస్ట్రీలో మత్తుకు బానిసలుగా మారిన వారు లేరని కాదు. ఎందుకంటే తాజాగా ఒక టాలీవుడ్ యువనటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఎక్కడో కాదు ముంబై మీరా రోడ్డులోని ఓ హోటల్ లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన యువనటి - చాంద్ పాషా అనే వ్యక్తితో పాటు రెడ్ హ్యాండెడ్ గా ఎన్.సి.బి అధికారులకు దొరికిపోయింది.
పోలీసులు వారి దగ్గర నుండి 10 లక్షల విలువైన డ్రగ్స్ అంటే దాదాపు 400 గ్రాములు స్వాధీనం చేసుకున్నారట. అంతేగాక ఆ యువనటితో పాటు చాంద్ పాషాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమలో ఆ యువనటి ఎవరా..? అనే ఆసక్తితో పాటు పలు ప్రశ్నలు రేకేత్తుతున్నాయని ఇండస్ట్రీ టాక్. మరి ఇదివరకే చాలామంది హీరోహీరోయిన్లు ఈ మత్తు దారిన పోయి తమ జీవితాలను సర్వం కోల్పోయారు. అయినా కూడా యువతలో ఏం జరుగుతుందో తెలియట్లేదని పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. మరి అవకాశాలు లేకే ఇలా డ్రగ్స్ బాట పడుతున్నారా.. లేక ఆల్రెడీ అలవాటు పడ్డారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే పోలీసులు తెలిపే వరకు వెయిట్ చేయాల్సిందే.