Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసు: సిద్ధార్థ్ అరెస్ట్ తర్వాత మరో ఇద్దరిపై దృష్టి పెట్టిన NCB..!
By: Tupaki Desk | 31 May 2021 10:30 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. దీనిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ.. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. మే 28న సుశాంత్ సింగ్ కు సన్నిహితుడు, పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితానీని ఎన్సీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఎన్సీబీ.. తాజాగా మరో ఇద్దరికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సుశాంత్ సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు.. ప్రస్తుతం అతన్ని తమ కస్టడీలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేసులో మరింత సమాచారం రాబట్టడానికి సుశాంత్ ఇంటిలో పని చేసిన నీరజ్ - కేశవ్ లను ప్రశ్నించేందుకు గానూ ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఎన్సీబీ వర్గాలు మీడియాకు స్వయంగా వెల్లడించారు. 'సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నాం. ఆ క్రమంలోనే నీరజ్ - కేశవ్ లకు సమన్లు జారీ చేశాం. ఈ కేసులో వీరిద్దరి పాత్ర కూడా కీలకమని భావిస్తున్నాం' అని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో వీరిని ఇప్పటికే సీబీఐ మరియు నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.