Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు : లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారు...?
By: Tupaki Desk | 24 Sep 2020 2:30 PM GMTబాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేవుతోంది. డ్రగ్స్ మాఫియాపై దర్యాప్తు ముమ్మరం చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్స్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్ - దీపికా పదుకునే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ పేర్లు వినిపించాయి. వార్తలను నిజం చేస్తూ ఈ నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. రేపు(సెప్టెంబర్ 25) రకుల్ ప్రీత్ సింగ్ - దీపికా పదుకునే విచారణకు హాజరుకానుండగా.. సెప్టెంబర్ 26న సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లు ఎన్సీబీ విచారణకు రానున్నారు.
ఇదిలా ఉండగా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేతిలో 50 మంది ప్రముఖుల జాబితా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో రియా ఫోన్ చాటింగ్ మరియు ఆమె వెల్లడించిన విషయాల ఆధారంగా ఎన్సీబీ ఓ జాబితా ప్రిపేర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ సీనియర్ అధికారి 'ఎ - లిస్ట్ సెలబ్రిటీలను విచారణకు రావాలని కోరినట్టు' చెప్పాడని నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా పలువురికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా - దీపికా మేనేజర్ కరిష్మా - సుశాంత్ మేనేజర్ శృతి మోడీలను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో సిమోన్ ఖంబాట్టా ఈ రోజు ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు.