Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: బాలీవుడ్ హీరోని ప్రశ్నిస్తున్న ఎన్‌సీబీ.. అరెస్ట్ కు అవకాశం..!
By: Tupaki Desk | 21 Dec 2020 2:30 PM GMTబాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ మరియు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా అర్జున్ రాంపాల్ ను మరోమారు ఎన్‌సిబి ప్రశ్నిస్తోందని తెలుస్తోంది. డ్రగ్ ప్లెడర్ లతో అర్జున్ రాంపాల్ కి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గత నవంబర్ లో ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించారు. అలానే అర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. తన ఇంట్లో దొరికిన మెడిసిన్స్ కు సంబంధించి రాంపాల్ ను ఎన్‌సిబి విచారణకు డిసెంబర్ 16న మరోసారి రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలను చూపిస్తూ అర్జున్ ఒక వారం సమయం తీసుకున్నాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అర్జున్ రాంపాల్ సోమవారం (డిసెంబర్ 21) ఉదయం రెండవ సారి విచారణకు ముంబై ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణలో తన ఇంట్లో లభించిన ముందులు మానసిక రుగ్మత కోసం డాక్టర్ సూచించిన మెడిసిన్స్ అని.. అర్జున్ రాంపాల్ దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ అందజేశారు. అయితే ఏజెన్సీకి అతను సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అర్జున్ రాంపాల్ ను ఎన్‌సిబి అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అర్జున్ రాంపాల్ మాత్రం తనకు ఎలాంటి డ్రగ్ పెడ్లర్లతో సంబంధం లేదని.. విచారణకు సహకరిస్తున్నానని.. అతను తన నివాసంలో దొరికిన మందులు తనకు డాక్టర్స్ సూచించిన మేరకే వాడుతున్నానని.. ప్రిస్క్రిప్షన్ సమర్పించానని చెబుతున్నాడు. కాగా, యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎన్సీబీ పలువురు విచారించడంతో పాటు కొందరిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ ప్రేయసి గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ను ఎన్‌సిబి రెండుసార్లు ప్రశ్నించింది. ఆమె సోదరుడు అగిసియాలోస్ డెమెట్రియేడ్స్ ను అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యాడు.