Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: దీపికా పదుకునే మేనేజర్ కోసం NCB వేట..!
By: Tupaki Desk | 2 Nov 2020 4:00 PM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం ఊహాతీతమైన మలుపుల గురించి తెలిసినదే. మర్డర్ మిస్టరీగా ప్రారంభమైన ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రముఖ కథానాయికల పేర్లు ఇందులో వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ అన్ ట్రేసిబుల్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో సమన్లు జారీ చేసినా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ స్పందించకపోవడంతో ఆమె కోసం ఎన్సీబీ వెతుకుతోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం సంచలనంగా మారింది.
ఇప్పటికే బాలీవుడ్ డ్రగ్ వ్యవహారం పై దర్యాప్తు జరిపిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ మేనేజర్స్ ని విచారించింది. ఇటీవల దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంట్లో జరిపిన సోదాల్లో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్.సి.బి అంకు సమన్లు జారీ చేసింది. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో ఆమె పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఎన్‌సీబీ తాజాగా ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి.. ఆ నోటీసులను ఆమె తల్లి మితాక్షర పురోహిత్ కు అందచేశారని తెలుస్తోంది. 'కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.8 గ్రాముల చరాస్ తో పాటు మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశామ'ని ఎన్సీబీ అధికారి వెల్లడించినట్లు నేషనల్ మీడియా తెలిపింది. అయితే కరిష్మా ప్రకాష్ ఎన్.డిపిఎస్ కోర్టుకు ముందస్తు బెయిల్ దరఖాస్తును దాఖలు చేశారనే మరో కథనం కూడా వస్తోంది.
కాగా, ఇంతకముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ గా ఉన్న మరో KWAN ఉద్యోగి జయ సాహాను ఎన్సీబీ అధికారులు విచారించారు. అలానే సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. అలాగే ఆమె సోదరుడు షోయిక్ తో పాటు పలువురు సుశాంత్ వ్యక్తిగత సిబ్బంది కూడా అరెస్టయ్యారు. అయితే రియా ఇటీవలే బెయిల్ పై విడుదల కాగా.. షోయిక్ మాత్రం ఇంకా జైలులో ఉన్నాడు. ఈ కేసులో దీపికా పదుకొనె - శ్రద్ధా కపూర్ - సారా ఆలీ ఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు కూడా వచ్చాయి. వీరిని విచారించిన ఎన్సీబీ ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో తిరిగి పంపించింది. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంటిపై దాడులు నిర్వహించడం.. ఆమెకు ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేయడం.. కరిష్మా అందుబాటులోకి రాకపోవడం మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.