Begin typing your search above and press return to search.
#NCB రిపోర్ట్: ఎట్టకేలకు డ్రగ్స్ సేవించానని రియా అంగీకారం?
By: Tupaki Desk | 20 Sep 2020 5:00 PM GMTసుశాంత్ సింగ్ కేసు దర్యాప్తులో రకరకాల విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి తాను డ్రగ్స్ పుచ్చుకోనని పదేపదే తిరస్కరించిన తర్వాత ఎట్టకేలకు మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్లు అంగీకరించింది. అంతేకాదు.. ఎన్.సి.బి తో ‘నేను మంచి నటి’ అని సమర్థించుకుంటూనే చేసిన తప్పును అంగీకరించిందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించడం విశేషం.
రియా చక్రవర్తి పై NCB ప్రశ్నల పరంపరలో 55వ ప్రశ్నకు సమాధానంగా.. తాను మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్లు అంగీకరించింది. ఈ కేసులో డ్రగ్స్ లింక్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తు లో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తితో సహా కొంతమందిని కూడా అరెస్టు చేసింది. సుశాంత్ కోసం తాను డ్రగ్స్ సేకరించానని రియా ఎన్‌సిబికి వెల్లడించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాను డ్రగ్స్ సేవించనని రియా వాదిస్తుండగా ఎన్ సీబీ పదే పదే తనను అదే ప్రశ్న అడిగిందట.
ఎన్.సి.బి అధికారులు అడిగిన 55 వ ప్రశ్నపై రియా సహనం చచ్చి విరుచుకుపడిందట. ‘మీరు ఎంత మంచి నటి?’ అనే ప్రశ్న తనను ఇర్రిటేట్ చేసిందట. ఈ ప్రశ్న వల్లనే ఇంతకుముందు ఖండించినా మాదకద్రవ్యాల సేవనాన్ని అంగీకరించడానికి లైన్ క్లియర్ చేసిందట. “నేను చాలా మంచి నటిని” అని రియా డ్రమటిగ్గా స్పందించగా.. కానీ నటించడానికి ఇది సరైన సమయం కాదు! అంటూ ఎన్.సి.బి అధికారులు ఆమెపై కౌంటర్ వేశారట. ``సరే.. మీరు డ్రగ్స్ సేవించకపోయి ఉంటే గనుక మీరు పెడ్లర్ .. ఇది మరింత తీవ్రమైన నేరం`` అని రియాతో అధికారులు అనడంతో తాను అంగీకరించిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.