Begin typing your search above and press return to search.
డ్రగ్స్ రాకెట్ లో మరికొందరు సినీ ప్రముఖులు.. కరణ్ జోహర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో సోదాలు..!
By: Tupaki Desk | 24 Sep 2020 5:32 PM GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో అనూహ్యంగా వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్స్ ని డ్రగ్ సప్లయర్స్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ - ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా - సుశాంత్ మేనేజర్ శృతి మోడీలను కూడా ఎన్‌సీబీ విచారణ చేస్తోంది.
కాగా, డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గోవా మరియు ముంబైలోని పలువురు డ్రగ్ డీలర్స్ ని విచారించగా చాలామంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో దాదాపు 150 మంది సినీ ప్రముఖల పేర్లు బయటకు వచ్చాయట. వారికి డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్సీబీ వారి గురించి వివరాలను సేకరిస్తోందట. ఆ లిస్ట్ లో ఉన్నవారి వివరాలు సేకరించిన తర్వాత పలువురికి సమన్లు జారీ చేసి విచారణ కొనసాగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్ వ్యవహారంలో కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ క్షతిజ్ రవి ప్రసాద్ ను విచారణకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న క్షితిజ్ రవి ప్రసాద్ ను రేపు (సెప్టెంబర్ 24) ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకోవాలని పేర్కొన్నారని తెలుస్తోంది. అదే సమయంలో అతని నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారని నేషనల్ మీడియా వెల్లడించింది. రేపు దీపికా పదుకునే - రకుల్ ప్రీత్ సింగ్ లను కూడా విచారించన్నారని తెలుస్తోంది.