Begin typing your search above and press return to search.
తలైవి' సాంగ్: ఎంజీఆర్ - జయలలితల ప్రేమ గీతం 'నీ కన్నుల్లో ఏమున్నదో'
By: Tupaki Desk | 30 Aug 2021 10:29 AM GMTజయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ''తలైవి''. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంజీఆర్ గా విలక్షణ నటుడు అరవింద స్వామి కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో వాయిదా పడిన ఈ సినిమాని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ తాజాగా 'నీ కన్నుల్లో ఏమున్నదో' అనే సాంగ్ ని వదిలారు.
'నీ కన్నుల్లో ఏమున్నదో.. కళ్ళు కలిపేసి తెలుసుకో.. నీ గుండెల్లో ఏమున్నదో.. గుర్తు పట్టేసి కలుసుకో..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఎమ్‌జీఆర్ - జయలలిత మధ్య (అరవిందస్వామి - కంగనా రనౌత్) వింటేజ్ లవ్ ని ఈ సాంగ్ లో చూపించారు. ఇది ఎమ్‌జీఆర్ - జయలలిత కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ నేపథ్యంలో రూపొందింది. జీవీ ప్రకాష్ దీనికి ట్యూన్ సమకూర్చారు. భాస్కర భట్ల సాహిత్యం అందించగా.. నకుల్ అభ్యంకార్ - నిరంజన రామనన్ ఈ మెలోడీ గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రానికి 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
'తలైవి' చిత్రంలో తమిళనాట రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది? 'అమ్మ' గా ఎలా ఎదిగింది? ఎంజీఆర్ కు ఆమెకు మధ్య ఉన్న ప్రేమ - సాన్నిహిత్యం వంటివి ప్రధానంగా చూపించబోతున్నారు. ఇందులో కరుణానిధిగా సముద్రఖని.. జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ.. జానకీ రామచంద్రన్ గా మధుబాల కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో విబ్రి మోషన్ పిక్చర్స్ - కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.