Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డ్‌ న‌టుడికి అంత‌టి అవ‌మాన‌మా?

By:  Tupaki Desk   |   16 Feb 2019 6:15 AM GMT
జాతీయ అవార్డ్‌ న‌టుడికి అంత‌టి అవ‌మాన‌మా?
X
కెరీర్ ఆరంభం ఎన్నో అవ‌మానాల్ని దిగ‌మింగుకుంటేనే ఆర్టిస్టుగా నిల‌దొక్కుకోగ‌ల‌రు. రంగుల ప్ర‌పంచం అనుకున్నంత వీజీ కాదని ఎంద‌రో అనుభ‌వంతో చెబుతుంటారు. అలాంటి ఓ అనుభ‌వం గురించి జాతీయ అవార్డు గ్ర‌హీత‌ - గ్రేట్ పెర్ఫామ‌ర్ మ‌నోజ్ భాజ్‌పాయ్ కొన్ని క‌ఠోర స‌త్యాల్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ``న‌టుడికి తోలు మందం అవ‌స‌రం లేదు. అదే త‌న‌ని ర‌క్షిస్తుంది ఇక్క‌డ అనుకుంటే పొర‌పాటే``న‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభంలో త‌న‌కు ఎన్నో అవ‌మానాలు ఎదుర‌య్యాయ‌ని, ఓసారి ఓ వేదిక‌పై ఒక ఫోటోగ్రాఫ‌ర్ వ‌ల్ల త‌న‌కు అవ‌మానం ఎదురైంద‌ని అన్నారు. ``అత‌డు అంత పాపుల‌ర్ ఆర్టిస్టు కాదు. త‌న ఫోటో అవ‌స‌రం లేదు`` అంటూ అత‌డు అవ‌మానించాడ‌ని మ‌నోజ్ భాజ్ పాయ్ అన్నారు. అలాంటివి ప‌ట్టించుకోకూడ‌ద‌ని న‌వ‌త‌రం ఆర్టిస్టుల‌కు సూచించారు. సినీ& టీవీ ఆర్టిస్టుల సంఘం (CINTAA) కార్య‌క్ర‌మంలో అలీఘ‌ర్ కి చెందిన న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ పైవిధంగా స్పందించారు.

సినీటీవీ ఆర్టిస్టుల‌తో ముంబైలో జ‌రిగిన ఓ సమ్మేళ‌న కార్య‌క్ర‌మంలో ఆర్టిస్టులంతా త‌మ అనుభ‌వాల్ని ఇలా పూస గుచ్చారు. సినీరంగంలో.. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో త‌మ‌కు ఎదుర‌య్యే అవ‌మానాల్ని - అనుభ‌వాల్ని వ‌ర్ణించారు. స‌క్సెస్ నిర్ణ‌యిస్తుంది ఇక్క‌డ‌. స‌క్సెస్ తోనే స్నేహితులు వెంట వ‌స్తారు. అది లేక‌పోతే స్నేహితులే మొహం చాటేస్తార‌ని అనుభ‌వ పూర్వ‌కంగా మ‌నోజ్ భాజ్ పాయ్ చెప్పిన‌ది మ‌న టాలీవుడ్ ఆర్టిస్టుల‌కు వ‌ర్తిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక్క‌డా అలాంటి అనుభ‌వాలెన్నో. ఆర్టిస్టుగా స‌క్సెసైతే చాలు .. వాళ్లంత‌ట వాళ్లే ఫోటోలు తీసేందుకు వ‌స్తారు.. అంటూ వ్యాఖ్యానించారు. ఇదే కార్య‌క్ర‌మంలో ఆర్టిస్టులంతా పుల్వామా ఘ‌ట‌న‌లో అమ‌రులైన మ‌న దేశ జ‌వాన్ల‌కు నివాళులు అర్పించారు.

మ‌నోజ్ భాజ్ పాయ్ చెప్పిన `అవ‌మానం` అనే కోణాన్ని టాలీవుడ్ ఆర్టిస్టుల‌కు అన్వ‌యిస్తే ఇక్క‌డా ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. హీరోలు - క‌థానాయిక‌ల‌కే అది త‌ప్ప‌దు. ఆఫ్ట్రాల్ మామూలు ఆర్టిస్టుల స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించాల్సిన ప‌నేలేదు. కొంద‌రు లేడీ ఆర్టిస్టులు అయితే ఎండ‌లో నిల‌బ‌డి ఆన్ లొకేష‌న్ భోజ‌నం చేయాల్సి ఉంటుంది. ప్లేట్ ప‌ట్టుకుని క్యూలో నిలుచోవాల్సిన స‌న్నివేశం ఉంటుంది. అదొక్క‌టేనా? స‌రిగా న‌టించ‌క‌పోతే డైరెక్ట‌ర్ నుంచి ఎదుర‌య్యే అవ‌మానాలు త‌క్కువేమీ కాద‌ని చెబుతుంటారు. ఒక‌సారి స‌క్సెస్ అయిన న‌టుడు లేదా న‌టి విష‌యంలో అది కాస్త త‌క్కువగా ఉంటుంది అంతే!!!