Begin typing your search above and press return to search.
బిచ్చగాడు.. మొత్తం ఊడ్చేశాడే
By: Tupaki Desk | 9 Dec 2017 7:35 AM GMTకొన్నిసార్లు సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. గత ఏడాది ‘బిచ్చగాడు’ కూడా అలాంటి అద్భుతమే చేసింది. ఈ సినిమా ఆ స్థాయిలో సంచలనం రేపుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అది రిలీజైన టైమింగ్ దానికి అలా కలిసొచ్చింది. మరో సమయంలో రిలీజైతే ఆ సినిమా అలాగే ఆడేసేదా అంటే సందేహమే. ఈ సినిమా సాధించిన సంచలన విజయంతో విజయ్ ఆంటోనీపై మన నిర్మాతల కళ్లు పడ్డాయి. ఆ తర్వాత అతను నటించిన ప్రతి సినిమానూ మంచి రేటుకు కొని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ‘బేతాళుడు’ నిరాశ పరిచినప్పటికీ ‘బిచ్చగాడు’ ప్రభావం వల్ల దానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘యమన్’ గట్టి దెబ్బ తీసింది.
ఇప్పుడు ‘ఇంద్రసేన’ సినిమా నీలం కృష్ణారెడ్డికి మామూలు దెబ్బ కాదు. గత సినిమాల ఫలితాల్ని పట్టించుకోకుండా రూ.2.25 కోట్లు పెట్టి సినిమాను కొన్నాడాయన. రాధిక శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం, ట్రైలర్ బాగుండటంతో టెంప్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు సినిమా చూస్తే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ లేవు. పైగా పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత కూడా పుంజుకోలేదు. కేవలం రూ.55 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చిందీ సినిమాకు. అంటే పెట్టుబడిలో 25 శాతం కూడా వెనక్కి రాలేదన్నమాట. ఈ దెబ్బతో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’తో తెచ్చుకున్న గుర్తింపు.. మార్కెట్ అన్నీ కూడా పోయినట్లే ఉన్నాయి. ఇకపై అతడి సినిమాల్ని ఎగబడి కొనే పరిస్థితి ఉండకపోవచ్చు.