Begin typing your search above and press return to search.

ఆచార్య స్పీక్స్ నౌ : నీలాంబ‌రి రాక‌కు నిరీక్ష‌ణ ! రొమాంటిక్ మానియా !

By:  Tupaki Desk   |   27 April 2022 3:00 PM GMT
ఆచార్య స్పీక్స్ నౌ : నీలాంబ‌రి రాక‌కు  నిరీక్ష‌ణ ! రొమాంటిక్ మానియా !
X
అందాల నీలాంబ‌రి రాక కోసం
అంతా నిరీక్షిస్తున్నారు..
ఆమె వినిపించే మాట, క‌వ్వించే చూపు
ఇవ‌న్నీ ఎలా అర్థవంతం కానున్నాయో
అన్న‌ది ఇంకొక ఇంట్ర‌స్టింగ్ పాయింట్

సినిమాటిక్ ప్రేమ‌లు ఎలా ఉన్నా కూడా
కొర‌టాల సినిమాలు మాత్రం అందుకు విభిన్నం
ఆ కోవలో ఆ తోవ‌లో
సిద్ధా ప్రేమ క‌థ ఎలా ఉండ‌నుంది అన్న‌ది
ఓ ఆస‌క్తికి కారకం..ప్ర‌ణ‌య వీధుల్లో
ఆ జంట న‌డ‌యాడే సంద‌ర్భం ఈ సినిమాకే ప్ర‌త్యేకం
చిరుతో చిందేసే భామ‌లు లేరే అన్న లోటు
ఉన్నా కూడా ఆ లోటును భ‌ర్తీ చేసేది
ఈ యువ జంటే !

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఆచార్య..టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. మాస్ అభిమానుల అభిరుచికి తగిన విధంగా సినిమాలను తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట..ఆయన నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమా కూడా అంతే రేంజ్ లో హిట్ అవుతుందని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఆచార్య సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్,ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ కూడా జనాల్లో మంచి స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని లాహె లాహె సాంగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మిలియన్‌ వ్యూస్ ను అందుకుంది. ఈ పాటలో ఖ‌డ్గం ఫేం సంగీత నృత్యం చేశారు. సినిమా విడుదల అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడం తో మూవీ టీం మెంబ‌ర్స్ ప్ర‌మోష‌న్స్ లో మరింత జోరును పెంచారు..నిన్నటి వేళ ప్రెస్ మీట్ ను నిర్వహించి ఎన్నో ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెల్ల‌డించారు చిరు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి చరణ్ పై వేసిన పంచులు, హీరోయిన్ పూజాహెగ్డే తో చేసిన అల్లరి సినిమా పై హైప్ ను మ‌రింత క్రియేట్ చేస్తున్నాయి.

ఇప్పుడు సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా చేయడానికి చిత్ర యూనిట్ మరో భారీ ప్లాన్ వేశారు. ఈ సినిమా లోని మోస్ట్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కిన నీలాంబరి సాంగ్ వీడియో వెర్ష‌న్ ను రిలీజ్ చేసింది. గతంలో ప్రొమోను విడుదల చేయగా.. తాజాగా ఎడిటెడ్ వెర్షన్ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది. దేవాలయ శాఖలో అన్యాయాలను ఎదురించే వ్య‌క్తులుగా, తుపాకీ ప‌ట్టిన యోధులుగా, విప్ల‌వ నేప‌థ్యం ఉన్న వారిగా తండ్రీ,కొడుకులు నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక ఈ సినిమా రికార్డుల ప‌రంగా ఎలాంటి కొత్త విశేషాల‌ను తీసుకురానుందో ...అందుకోసం మ‌రికొద్ది గంటలు వేచి చూడాలి.