Begin typing your search above and press return to search.
వీడియో : 'ఆచార్య' నీలాంబరి వచ్చేసింది
By: Tupaki Desk | 4 Nov 2021 4:23 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. సెకండ్ వేవ్ కు ముందు మే నెలలో విడుదల చేయాలని విడుదల తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది. కాని కరోనా సెకండ్ వేవ్ ఆచార్య ప్లాన్స్ అన్నింటిని తలకిందులు చేయడం జరిగింది. ఆచార్య విడుదల ఇటీవలే ఫిబ్రవరిలో అంటూ ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. మొదట చరణ్ పాత్రను గెస్ట్ రోల్ గా అనుకున్నారు. కాని చిరంజీవి మరియు చరణ్ లు కలిసి నటిస్తే అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో చరణ్ పాత్రను పెంచేశారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్బంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో ఆచార్య సినిమాలో ఉండే పాట ప్రోమోను విడుదల చేయడం జరిగింది.
నీలాంబరి అంటూ సాగే ఈ పాట ను చరణ్ మంచి డాన్స్ స్టెప్పులతో రూపొందించారు. ఇంతకు ముందు వచ్చిన లాహె లాహె పాట ఎలా అయితే టెంపుల్ సిటీలో చిత్రీకరించారో.. ఈ పాటను కూడా అదే పరిసరాల్లో చిత్రీకరించినట్లుగా నీలాంబరి పాట ప్రోమోను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ సింపుల్ అండ్ సిద్ద లుక్ కు అభిమానులు ఫిదా అయ్యేలా ఉన్నారు. ఇక నీలాంబరిగా పూజా హెగ్డే కూడా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. వీరిద్దరి కాంబోలో ఉండేది ఇది ఒకే ఒక్క పాట అన్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ ఒక్క పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ముహూర్తంను ఖరారు చేశారు. నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీపావళి తర్వాత రోజు అంటే రేపు ఆ పాట పూర్తిగా మన ముందుకు వచ్చేయబోతుంది.
ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందింది. కేవలం వంద రోజుల్లో ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేస్తానంటూ కొరటాల శివ మెగా అభిమానులకు హామీ ఇచ్చాడు. కాలం కలిసి రాకపోవడంతో కరోనా కాటు వేసి సినిమా వంద రోజులు కాస్త రెండేళ్ల సమయం పట్టింది. ఆచార్య సినిమా ఇంత ఆలస్యం అయినా కూడా అభిమానుల్లో ఇసుమంతైనా ఆసక్తి తగ్గలేదు. ఇలాంటి పాటలు పోస్టర్ లు వస్తున్న సమయంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. లాహె లాహె పాట మణిశర్మ సంగీత సారధ్యంలో వచ్చి భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. ఈ నీలాంబరి పాటకు కూడా మణిశర్మ సంగీతాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా లు ఆలపించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించారు. ఈ పాటలో చరణ్ డాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ అందించాడు. సినిమాలో ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.