Begin typing your search above and press return to search.
150 మిలియన్ల వ్యూస్ దాటిన యాంకర్ పాట!
By: Tupaki Desk | 3 Jun 2020 2:00 PM GMTటాలీవుడ్ టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. ఈ సినిమాలోని ‘నీలినీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. తెలుగు సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన కొత్త పాటగ సరికొత్త రికార్డు సాధించింది. సుకుమార్ దగ్గర ఆర్య 2, 1నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా.. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కన్నడ చిత్రసీమలో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన.. ‘నీలి నీలి ఆకాశం‘ పాటతో సహా ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు.
యాంకర్ ప్రదీప్, అమృతా అయ్యర్ లపై చిత్రీకరించిన ఈ పాట 150 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు పెద్ద స్టార్స్ లేని చిన్న సినిమాలోని పాటకు మిలియన్లలో ఆదరణ లభించడం గొప్ప విషయం అని సినీ వర్గాలు చెప్తున్నాయి. అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీకి చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం.. అలాగే సిద్ శ్రీరామ్, సునీత తియ్యని గళాలు ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఒక సింగర్‌ను ఐదేళ్లు బ్రతికించడానికి ఒక పాట చాలనీ, నీలి నీలి ఆకాశం అలాంటి పాటనీ గాయని సునీత పేర్కొంది. అంతేగాక తన కెరీర్‌లో ఈ పాట ఓ మధురమైన మలుపుగా నిలించిందని ఆమె అమితానందం వ్యక్తం చేశారు. ఈ పాట విజయోత్సవంలో తాను భాగస్వామినే కాకుండా భావస్వామిని కూడా అయినందుకు గర్వపడుతున్నానని లిరిసిస్ట్ చంద్రబోస్ తెలిపారు.