Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పెద్ద ఎస్సెట్.. ఆపండి ప్లీజ్
By: Tupaki Desk | 12 Oct 2015 4:00 PM GMTఅసలు ఈరోజు ఉదయం దాసరి నారాయణరావు ఎప్పుడైతే.. రుద్రమదేవి సినిమా కోసం బ్రూస్ లీ వెయిట్ చేయొచ్చుగా అంటూ పెద్ద కార్చిచ్చును లేపారో.. అప్పటినుండి మెగా ఫ్యాన్సులో అసహనం బయలుదేరిపోయింది. వెంటనే వారు సోషల్ సైట్లలో దాసరిపై.. అలాగే రుద్రమ టీమ్ పై విరుచుకుపడ్డారు.
అక్టోబర్ 16న బ్రూస్ లీ సినిమా వస్తోందని.. 3 నెలల ముందే తెలుసు కాబట్టి.. మీరు 9న సినిమా రిలీజ్ చేసేటప్పుడు వారిని సంప్రదించకుండా.. ఇప్పుడు మాత్రం ఇన్ డైరెక్టుగా దాసరితో ఇలా పోస్టుపోన్ చేయించమని రచ్చ చేస్తున్నారేంటి అంటూ వారు ఆరోపించారు. అంతేకాదు.. మెగాస్టార్ వాయిస్ ను సినిమాలో వాడేసుకొని.. దానితో బోలెడంత ఇంప్రెషన్ కొట్టేసి.. ఇప్పుడేమో ఇలా ఎర్త్ పెడతారా అంటూ వారు ఫైరయ్యారు కూడా. అయితే ఈ అభిమానులకు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు గుణశేఖర్ భార్య నీలిమా గుణ.
''మెగాస్టార్ వాయిస్ మా సినిమా సక్సెస్ కు ఎంతో ఉపయోగబడింది. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఆయనకు మేం జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే దాసరి గారు స్వయంగా ఆయనే సినిమా చూసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు తప్పించి మేం ఆయన దగ్గరకు వెళ్లలేదు. దయచేసి అర్ధంచేసుకోండి. రేపు రిలీజ్ అయ్యే బ్రూస్ లీ.. మా రుద్రమదేవి.. రెండింటినీ సపోర్టు చేయండి. ఈ ఎద్దేవా చేయడం ఆపేయండి ప్లీజ్'' అంటూ ఆమె కోరుకున్నారు.