Begin typing your search above and press return to search.

ఒలింపిక్ విజేత‌ నీరజ్ చోప్రా బ‌యోపిక్ లో హీరో ఎవ‌రైతే బావుంటుంది?

By:  Tupaki Desk   |   11 Aug 2021 4:43 AM GMT
ఒలింపిక్ విజేత‌ నీరజ్ చోప్రా బ‌యోపిక్ లో హీరో ఎవ‌రైతే బావుంటుంది?
X
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినప్పటి నుండి అతను దేశంలో ఒక పెద్ద‌ స్టార్ అయ్యాడు. ఇంత‌లోనే నీజ‌ర్ బయోపిక్ కోసం బాలీవుడ్ నిర్మాత‌లు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవల ఇంటర్వ్యూలో నీరజ్ ని ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే అత‌డు త‌న ఫేవ‌రెట్ స్టార్ల పేర్ల‌ను వెల్ల‌డించారు. అక్షయ్ కుమార్ లేదా రణదీప్ హుడా త‌న బయోపిక్ లో న‌టిస్తే చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అయితే ఇంత‌లోనే ఇదే ప్ర‌శ్న కిలాడీ అక్షయ్ కుమార్ కి ఎదురైంది. ఓ ప్ర‌ముఖ వెబ్ పోర్టల్ ఇంట‌ర్వ్యూలో నీరజ్ పాత్రను చేయాలనుకుంటున్నారా? అని అక్ష‌య్ ని ప్ర‌శ్నిస్తే అత‌డు టిఫిక‌ల్ ఆన్స‌ర్ ఇచ్చారు. `` నీరజ్ చోప్రా చాలా మంచి వ్యక్తి. ఒకవేళ నా జీవితంపై బయోపిక్ తీస్తే అతను అందులో ప్రధాన హీరో కావచ్చు.. (అగర్ మేరా కోయి బయోపిక్ కరేగా తో వో కర్ సక్తా హై) అంటూ అక్ష‌య్ జ‌వాబిచ్చారు. అక్ష‌య్ ఫాలోవ‌ర్స్ ప్ర‌స్తుతం అత‌డి పాత చిత్రాన్ని పంచుకుని అంత‌ర్జాలంలో వైర‌ల్ చేస్తున్నారు. నీరజ్ బయోపిక్ కోసం అక్ష‌య్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారని ప్ర‌చారం సాగిస్తున్నారు. ఆ విష‌యం అక్ష‌య్ వ‌ర‌కూ చేరింది.

``నేను నా చేతిలో కర్ర పట్టుకున్న ఒక మీమ్ ని అంత‌ర్జాలంలో చూశాను. ఇది నా మొదటి సినిమా `సౌగంధ్` నుండి ఎంపిక చేసిన‌ది. ఇప్పటికే సినిమా కోసం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించేశాడు.. అంటూ ఫన్ నోట్ లో ఆయన పేర్కొన్నారు. ఇక నీరజ్ మరొక ఇంటర్వ్యూలో తన బయోపిక్ తీయాలని తాను కోరుకోవడం లేదని చెప్పాడు. ఇది చాలా తొందరపాటు అవుతుంద‌ని కూడా అన్నాడు. మునుముందు సాధించాల్సింది చాలా ఉంది.. అని వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట నుండి రిటైర్ అయిన తర్వాత సినిమా తీయాలని కోరుకున్నాడు. అయితే అక్ష‌య్ లేదా ర‌ణ‌దీప్ హుడా అయితే బావుంటుంద‌నేది అత‌డి ఉద్ధేశం.