Begin typing your search above and press return to search.
ధోనీకి ఫ్యాన్ కాకపోయినా తీశాడట
By: Tupaki Desk | 13 Sep 2016 9:30 AM GMTబాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాలున్న సినిమా.. ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ. ట్రైలర్ తోనే ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ మూవీ కోసం బాలీవుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియాకు రెండు ప్రపంచ కప్పులు అందించిన రియల్ హీరో రియల్ స్టోరీని చూసేందుకు బోలెడంత మంది ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా దర్శకుడు నీరజ్ పాండే మాత్రం.. తాను మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ కాదని చెబుతున్నాడు.
'నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ధోనీ బ్యాటింగ్ కూడా ఇష్టమే కానీ ఫ్యాన్ ని కాదు. సచిన్- ఏబీ డివిల్లీర్స్ ల బ్యాటింగ్ ని ఇష్టపడ్డట్టుగానే ధోనీ కూడా. వారికీ అభిమానిని కాదు. ధోనికి కూడా ఫ్యాన్ ని కాదు. ఈ సంగతి ధనాధన్ క్రికెటర్ కి ముందే చెప్పాను. అభిమానిగా కనుక నేను సినిమా తీస్తే.. ధోనీని చూపించాలని అనుకున్న కోణంలో చూపించగలిగే వాడిని కాదు. నా కోరిక నెరవేరేది కాదు' అన్నాడు నీరజ్ పాండే.
ఇక ధోనీ-అన్ టోల్డ్ స్టోరీలో ధోనీ పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది కూడా.. ధోనీ ప్రాంతమే. అందుకే మహేంద్రుడిలా అతని యాసలో మాట్లాడ్డానికి పెద్దగా ఇబ్బంది కలగలేదని.. అసలీ పాత్రకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయిస్ సుశాంత్ మాత్రమేనని చెప్పాడు నీరజ్ పాండే.