Begin typing your search above and press return to search.

లేడీ సినిమాలలో టాప్ ఆమెకే

By:  Tupaki Desk   |   1 March 2016 9:29 AM GMT
లేడీ సినిమాలలో టాప్ ఆమెకే
X
కేవలం అందచందాలతో మాత్రమే ఇప్పటివరకూ అవకాశాలు దక్కినా, వార్తలలో నిలిచినా అంటూ కెరీర్ ని కొనసాగిస్తున్న సోనప్ కపూర్ కి నీర్జా సినిమాలో నటనకు గానూ ఎనలేని ప్రశంసలను అందుకుంది. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సొనమ్ పై పొగడ్తల జల్లు కురుస్తుంది.

పెట్టిన బడ్జెట్ ని తక్కువ రోజుల్లోనే రాబట్టుకున్న ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల మార్కుని టచ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంగ్ రన్ లో ఇంకో పది పదిహేను కోట్లు సులభంగా సాధించే స్టామినా వుంది గనుక లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో టాప్ పిక్చర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

ఇప్పటివరకూ విద్యాబాలన్ కహానీ చిత్రం 57కోట్లు సాధించగా, కంగనా రనౌత్ క్వీన్ 61కోట్లతో టాప్ లో నిలిచింది. ఈ రెండు చిత్రాలని నీర్జా అలవోకగా దాటేస్తుందని పండితుల అంచనా.