Begin typing your search above and press return to search.

కేర‌ళ కోసం మిలియ‌నీర్ డిజైన‌ర్..

By:  Tupaki Desk   |   4 Sep 2018 1:30 AM GMT
కేర‌ళ కోసం మిలియ‌నీర్ డిజైన‌ర్..
X
కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు త‌మ‌వంతు డొనేష‌న్లు ఇచ్చి ఆదుకున్నారు. టాలీవుడ్ - కోలీవుడ్ పెద్ద ఎత్తున సాయం చేశాయి. అన్ని వైపుల నుంచి దాదాపు 100 కోట్ల మేర ఫండ్ కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కి చేరింద‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇంకా ఇప్ప‌టికీ విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ త‌న‌వంతు సాయంగా కోటి విరాళం ప్ర‌క‌టించారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీతా లుల్లా త‌న‌దైన క్రియేటివిటీతో కేర‌ళ వ‌ర‌ద‌ల సాయం కోర‌డం చ‌ర్చ‌కొచ్చింది. నీతా ఓ క్రియేటివ్ ఆర్ట్‌ని ఈ సంద‌ర్భంగా స్కెచ్ వేసి త‌న సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. `వ‌ర‌ద గంగ‌లో మున‌క‌లు వేసిన కేర‌ళ రాష్ట్రానికి చేయిచ్చి` ఆదుకుంటున్న ఆర్ట్‌ ని స్కెచ్ వేసి ట్విట్ట‌ర్‌ లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రం వాట్సాప్‌ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. కేర‌ళ‌కు ప్ర‌తి ఒక్క‌రూ సాయం చేయాల‌ని, ఆర్థిక‌సాయంతో పాటు దుస్తులు పంపాల‌ని కోరారు.

నీతా లుల్లా బిలియ‌న్ డాల‌ర్ బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఫేమ‌స్ డిజైన‌ర్‌. నీతా భ‌ర్త డా.శ్యామ్ లుల్లా సైక్రియాటిస్ట్‌. కుమార్తె నిష్కా లుల్లా త‌న త‌ల్లి నీతాలానే గొప్ప క్రియేట‌ర్‌ గా పేరు తెచ్చుకుంటోంది. ప్ర‌ఖ్యాత మిడ్ డే ఈ కుటుంబానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర ఫోటోల్ని రివీల్ చేస్తూ క‌థ‌నం వెలువ‌రించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది.