Begin typing your search above and press return to search.
కమ్ముల హీరోయిన్ సినిమా యుట్యూబులో..
By: Tupaki Desk | 22 Dec 2017 5:30 PM GMT'విష్ణు' సినిమాలో చిన్న రోల్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బీహారి గర్ల్ నీతూ చంద్ర. అమ్మడు ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలో కూడా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ - కోలీవుడ్ అని తేడా లేకుండా వివిధ భాషల్లో నటించి మాంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ గత కొంత కాలంగా ఎటువంటి పాత్రలు చేస్తున్నా కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడం లేదు. స్టార్ హీరోస్ సరసన నటిస్తోంది కానీ సైడ్ హీరోయిన్ గానే పాత్రలు దక్కుతున్నాయి.
ఇకపోతే ఈ బ్యూటీ అందరిలా కాకుండా సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో ఒక సినిమా నిర్మించి చూపించింది. నీతూ తన సొంత బాష భోజ్ పూరి లో ఒక సినిమాని నిర్మించించింది. దేస్వా అనే ఆ సినిమాని ఆమె సోదరుడు నితిన్ చంద్ర తెరకెక్కించాడు. అతడు నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే బీహార్ లోని నిరుద్యోగ సమస్యలు ఏ స్థాయిలో ఉందో చూపించడానికి అలాగే పేదల కష్టాలు అద్దం పట్టేలా దేస్వా సినిమాను తీశారు. గోవాలో 16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మొట్టమొదటి భోజ్పురి చిత్రంగాను అలాగే భారత పానారొమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఐఎఫ్) 54 సంవత్సరాలలో ఎంపిక చేసిన మొట్టమొదటి భోజ్ పురి చిత్రంగాను దేస్వా సినిమా గుర్తింపును అందుకుంది.
ఇక విషయం ఏంటంటే. ఈ సినిమాను 2011 లొనే నిర్మించారు. గుర్తింపులను అయితే దక్కించుకుంది గాని రిలీజ్ కాలేదు. ఇపుడు ఫైనల్ గా యూట్యూబ్ డిజిటల్ ఛానల్ నియో బీహార్ ద్వారా విడుదల అవుతుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ ని చాలా ప్రశంసించారు.