Begin typing your search above and press return to search.
సిద్దార్థ్ పై భగ్గుమన్న నీతూ
By: Tupaki Desk | 23 Jan 2018 5:45 AM GMTగోదావరి సినిమాలో హీరో సుమంత్ పక్కన తన మరదలిగా అతన్ని వద్దనుకునే పాత్రలో నటించిన నీతూ చంద్ర గుర్తుందిగా. చక్కని పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్న నీతూ ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అక్కడా బ్లాక్ బస్టర్ అని గర్వంగా చెప్పుకునే సినిమా ఏది లేనప్పటికీ అడపాదడపా అవకాశాలకు కొదవ లేకుండా చూసుకుంది. తాజాగా నీతూ బాలీవుడ్ హీరో సిద్దార్థ మహోత్రాను ట్విట్టర్ లో బహిరంగంగా తిట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 9వ విడుదల కానున్న అయారి సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోకు ప్రత్యేక అతిధిగా వచ్చిన సిద్దార్థ్ మల్హోత్రా కామెడీ చేయబోయే క్రమంలో భోజ్ పూరి బాషపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యంగ్యంగా మాట్లాడాడు. దీని మీద సోషల్ మీడియాలో ఇప్పటికే అతని ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సిద్దార్థ్ కు తలంటారు.
నీతూ చంద్ర మాత్రం కాస్త ఘాటుగా స్పందించింది. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుకునే బాషలలో ఒకటైన భోజ్ పూరి గురించి ఇంత దిగజారి మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గు పడాలని నేరుగానే విమర్శించింది. భోజ్ పూరి మాట్లాడితే నీకు మురుగు వాసన వస్తున్న ఫీలింగ్ కలిగించడం నీ సంస్కారాన్ని చూపిస్తోందని కాస్త గట్టి డోస్ ఇచ్చింది నీతూ. తన కామెంట్స్ కు భారీ మద్దతు లభిస్తోంది. ఇలా బాషలపై వెకిలిగా మాట్లాడేవాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు. నీతూ ఇంతగా ఫైర్ అవడానికి కారణం ఉంది. తన మాతృ బాష భోజ్ పూరినే. నీతూ స్వంత రాష్ట్రం బిహార్. పాట్నా - పునేల్లో తన చదువు సాగించిన నీతుకు భోజ్ పూరి అంటే ప్రాణం
ఎరక్క పోయి వచ్చి ఏదో మాట్లాడి ఇరుక్కుపోయాడు సిద్దార్థ్ మల్హోత్రా. తాను ప్రమోట్ చేస్తున్న అయారి సినిమాలో హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దీంతోనే తన బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది. జనవరి 26నే విడుదల కావలసిన ఈ మూవీ పద్మావత్ - ప్యాడ్ మ్యాన్ కోసం వాయిదా వేసుకుంటే ప్యాడ్ మ్యాన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని 9న మళ్ళి అయారి తో పోటీ పడనుంది. ఇంకా నీతూ కామెంట్స్ కి సిద్ధార్థ్ మల్హోత్రా జవాబు ఇవ్వలేదు. సారీ చెప్పడం వేరే ఆప్షన్ లేదు కనక అదేదో చెప్పేస్తే బెటర్.