Begin typing your search above and press return to search.
హీరో కోసం పిల్లను వెతుకుతున్నారు
By: Tupaki Desk | 1 Dec 2017 6:49 AM GMTబాలీవుడ్ లో రూమర్స్ గురించి అక్కడి తారలు చాలా లైట్ తీసుకుంటారు. ఎన్న వల్గర్ రూమర్స్ వచ్చినా వాటిపై సెటైర్లు వేస్తుంటారు. మరికొందరైతే అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో రోజుకొక టాక్ వినిపిస్తుంటోంది. ఒక్కోసారి అవి నిజాలు అవ్వచ్చు లేక అబద్దాలు అవ్వచ్చు. అయితే ఉహాగానాలని తారలు పట్టించుకోకయినా వారి ఇంట్లో వారు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు.
వారి కెరీర్ గురించి ఇంట్లో చెప్పనిది కొంతమంది తారలు ఎంత మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఇక అసలు మ్యాటర్ లోకి రణబీర్ కపూర్ కూడా ఇంట్లో వాళ్లకి చెప్పి ఏ పని చేయనని.. కాకపోతే నా సొంత నిర్ణయాలకు వారు ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుంటారని చాలా సార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తోన్న టాక్ గురించి వింటుంటే రణబీర్ ఇంట్లో వాళ్లు మనోడిపై కొంత ఒత్తిడి తెస్తున్నారా ? అనే సందేహం కలుగుతోంది.
ముఖ్యంగా తల్లి నీతూ సింగ్ తన కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకొందట. అయితే గత కొంత కాలంగా ఈ హీరో మాత్రం ఆల్రెడీ పిల్లాడు కూడా ఉన్న డైవర్సీ.. పాక్ భామ మహీరా ఖాన్ తో డేటింగ్ చేస్తున్నాడని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా నీతూ మాత్రం హీరోకి మంచి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట. మహీరా ఖాన్ తో డేటింగ్ చేస్తుండటమే అందుకు కారణం అని తెలుస్తోంది. మరి రణబీర్ పెళ్లి విషయంలో నెక్స్ట్ ఎలాంటి న్యూస్ వస్తుందో చూడాలి.