Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అంత పని చేశారు
By: Tupaki Desk | 18 Oct 2016 7:30 PM GMTతెలుగులో ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక హీరో సినిమా విడుదలైనపుడు అతడి అభిమానులు పాజిటివ్ ప్రచారం ఎంత చేస్తారో.. యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్రచారమూ అదే స్థాయిలో చేస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి. ఒక పెద్ద సినిమా రిలీజైనపుడు ట్విట్టర్.. ఫేస్ బుక్ పరిశీలించారంటే ఈ విషయం అర్థమవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ టైంలో కొంచెం డివైడ్ టాక్ రావడం ఆలస్యం.. ఈ సినిమా మీద ఒక వర్గం ఏ స్థాయిలో దుష్ప్రచారం సాగించిందో సోషల్ మీడియాలో ఉన్నవాళ్లకు బాగానే తెలుసు. ఐతే మామూలుగా ఇలాంటి ప్రచారం అందరూ చేస్తారు. కానీ ఒక వర్గం మరీ శ్రుతి మించి పోయింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ జర్నలిస్టు పేరుతో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించింది. ఆ జర్నలిస్టు పేరిట ‘జనతా గ్యారేజ్’కు వ్యతిరేకంగా ట్వీట్లు గుప్పించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లను తక్కువ చేసి చూపిస్తూ కూడా ట్వీట్లు పెట్టారు. దీంతో అందరూ ఈ జర్నలిస్టును అపార్థం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడి మీద వ్యతిరేకత పెంచుకున్నారు.
ఐతే తన పేరిట ఫేక్ అకౌంట్ పెట్టి.. ఇలాంటి ప్రచారం చేస్తున్న సంగతి ఆ జర్నలిస్టుకు ఆలస్యంగా తెలిసింది. ఆయన అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వచ్చింది పరిస్థితి. ప్రస్తుతం సైబర్ బ్రాంచ్ పోలీసులు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నరో విచారణ జరుపుతున్నారు. అయినా తమ హీరో మీద అభిమానం ఉండొచ్చు కానీ.. అవతలి హీరో మీద ఇలా దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబో ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/