Begin typing your search above and press return to search.

`కేజీఎఫ్` బ్యాడ్ ప్రొప‌గండా వ‌ల్లే ఈసారి ఛాన్స్ మిస్?!

By:  Tupaki Desk   |   21 Feb 2021 7:10 AM GMT
`కేజీఎఫ్` బ్యాడ్ ప్రొప‌గండా వ‌ల్లే ఈసారి ఛాన్స్ మిస్?!
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన కేజీఎఫ్ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించి దాదాపు 350 కోట్లు వ‌సూలు చేసింది. అయితే ఇందులో ఒక్క క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచే 120 కోట్లు పైగా వ‌సూలు కాగా హిందీ చిత్ర సీమ నుంచి మెజారిటీ క‌లెక్ష‌న్స్ తెచ్చింది. అక్క‌డ డ‌బుల్ సెంచ‌రీ కొట్టేయ‌డం అప్ప‌ట్లో గొప్ప‌ సంచ‌ల‌న‌మే అయ్యింది.

కానీ తెలుగు సినీప‌రిశ్ర‌మ వ‌సూళ్లు మాత్రం తీసిక‌ట్టుగా క‌నిపించాయి. ఆ సినిమా స్టామినాకు త‌గ్గ‌ట్టు ఇక్క‌డ వ‌సూలు చేయ‌లేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కేజీఎఫ్ ని ఏదో మ‌మ అనిపించే రీతిలో ఇక్క‌డ రిలీజ్ చేయ‌డం.. మీడియాని దూరం పెట్ట‌డంతో పూర్తి నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యింది అప్ప‌ట్లో. స‌మీక్ష‌లు కూడా పాజిటివ్ గా రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. కొన్ని స‌మీక్ష‌లు బావున్నా క‌లెక్ష‌న్లు తేలేద‌న్న టాక్ స్ప్రెడ్ అవ్వ‌డం మైన‌స్ అయ్యింది.

నిజానికి ఈ సినిమాని టాలీవుడ్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స్నేహితుడైన ప్ర‌ముఖ పంపిణీదారు కం నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేశారు. కానీ రాజ‌మౌళితో ప్ర‌చారం స‌రిపోతుంద‌ని భావించి మీడియాని లైట్ తీస్కోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ ఇప్పుడు కేజీఎఫ్ ని మించిన క్రేజుతో అత్యంత భారీగా రిలీజ‌వుతోంది కేజీఎఫ్ 2. ఈసారి రిలీజ్ చేసే ఛాన్స్ సాయి కొర్ర‌పాటి మిస్స‌య్యారు. నైజాం కింగ్ దిల్ రాజు ఈ చిత్రాన్ని చేజిక్కించుకుని రిలీజ్ చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు 2.0 త‌ర్వాత మ‌ళ్లీ అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 పంపిణీ హ‌క్కుల్ని కొనుక్కున్నార‌ట రాజు గారు. ఊపు చూస్తుంటే టాలీవుడ్ నుంచే 100కోట్లు కొల్ల‌గొట్టినా ఆశ్చ‌ర్యం లేద‌న్న అంచ‌నాతోనే ఆయ‌న దాదాపు 65 కోట్లు వెచ్చించి హ‌క్కులు కొనుగోలు చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే ప్ర‌చారం ప‌రంగా గ‌త త‌ప్పిదాలు ఈసారి రిపీట్ కాక‌పోతే నిజంగానే ఒక స్ట్రెయిట్ అగ్ర హీరో సినిమాని త‌ల‌పించేలా కేజీఎఫ్ 2 వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ప‌బ్లిసిటీ ప‌రంగా నెగెటివిటీ స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవ‌డం అత్యావ‌శ్య‌కం అన్న విశ్లేష‌ణ సాగుతోంది. నైజాం - వైజాగ్ ని రియ‌ల్ కింగ్ లా ఏల్తున్న డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు ఎవ‌రినీ పోటీకి రానివ్వ‌కుండా పెద్ద సినిమాల్ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. 2.0 కోసం 72 కోట్లు పెట్టిన ఆయ‌న ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం ఏకంగా 65 కోట్లు పెడుతుండ‌డం వెన‌క లెక్క‌లు గ‌ట్టిగానే ఉన్నాయి. అడ్వాన్స్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక హోంబ‌లే సంస్థ ఒక‌రిని ప‌క్క‌న పెట్టి ఇంకొక‌రిని స్ట్రీమ్ లైన్ లోకి తేవ‌డం అంటే ఆ మేర‌కు ఈ వ్య‌వ‌హారంపైనా టాలీవుడ్ లో వేడిగానే డిస్క‌ష‌న్ మొద‌లైంది.