Begin typing your search above and press return to search.
తన ట్రస్ట్ చిన్నారులకు నెగెటివ్.. లారెన్స్ ఎమోషనల్
By: Tupaki Desk | 6 Jun 2020 10:10 AM GMTరాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా, దర్శకుడిగా విభిన్న శైలితో ముందుకెళ్తున్న ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. చెన్నైలో అనాథ చిన్నారుల కోసం పెద్ద ట్రస్టునే రాఘవ లారెన్స్ నడుపుతున్నాడు.
చెన్నైలో మహమ్మారి వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. దీంతో రాఘవ లారెన్స్ ట్రస్టులోని చిన్నారులకు కరోనా టెస్టులు చేశారు. అందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఈ వార్త తెలియడంతో రాఘవ లారెన్స్ తోపాటు చాలా మంది బాధపడ్డారు. ఆ అనాథలకు ఏం కాకూడదని అంతా ప్రార్థించారు.
రాఘవ లారెన్స్ ఈ చిన్నారుల్లో ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించారు. దీంతో వారంతా ఆరోగ్యంగా బయటకు రావాలని అందరూ కోరుకున్నారు.
తాజాగా లారెన్స్ ట్రస్ట్ లోని చిన్నారులు అందరికీ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో వారందరినీ తిరిగి ట్రస్ట్ కు తీసుకువచ్చినట్టు లారెన్స్ ఎమోషనల్ పోస్టును ట్విట్టర్ లో పెట్టారు. ఈ సందర్భంగా చిన్నారుల విషయంలో కేర్ తీసుకున్న ఎస్పీ, మంత్రి, డాక్టర్స్, నర్సులకు లారెన్స్ కృతజ్ఞతలు తెలిపారు.