Begin typing your search above and press return to search.

క‌రోనా టెస్టులో ప‌వ‌న్ కు నెగెటివ్‌?

By:  Tupaki Desk   |   20 April 2021 9:37 AM GMT
క‌రోనా టెస్టులో ప‌వ‌న్ కు నెగెటివ్‌?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొవిడ్ ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ రిపోర్టు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్ లోని ట్రినిటీ ఆసుప‌త్రిలో ప‌వ‌న్ టెస్టు చేయించుకోగా.. కొవిడ్ త‌గ్గిపోయిన‌ట్టు తేలింద‌ని స‌మాచారం. ఆయ‌న‌లో క‌రోనా తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌డంతో.. త్వ‌ర‌గా కోలుకున్నార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌డంతో.. క్వారంటైన్లోకి వెళ్లారు ప‌వ‌న్‌. ఆ త‌ర్వాత క‌రోనా పాజిటివ్ రావ‌డంతో.. ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజుల కింద‌టి వ‌ర‌కు లంగ్స్ ఇన్ఫెక్ష‌న్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టు రిపోర్టులు వ‌చ్చాయి. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో.. ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ పూజ‌లు నిర్వ‌హించారు. స‌హ న‌టులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ప‌వ‌న్ ఆరోగ్యంగా తిరిగిరావాల‌ని ఆకాంక్షించారు. నిన్న‌టి రిపోర్టు ప్ర‌కారం ప‌వ‌న్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని తేలింది. తాజాగా.. నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింద‌ని స‌మాచారం.

అయితే.. ఈ విష‌యాన్ని అటు వైద్యులు కానీ.. ఇటు జ‌న‌సేన పార్టీ నుంచి అధికారిక స‌మాచారం వెల్ల‌డి కాలేదు. దీంతో.. నిజం ఏంటో తెలియ‌క ఫ్యాన్స్ అయోమ‌యానికి గుర‌వుతున్నారు.