Begin typing your search above and press return to search.
అగ్ర హీరో సినిమాపై అంత నెగెటివిటీ ఎందుకు..?
By: Tupaki Desk | 20 Sep 2022 5:16 AM GMTస్టార్ హీరోల సినిమాలకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేయకపోయినా.. ఏదొక ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది. దీనికి తగ్గట్టుగానే కొన్ని నెలల ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అవుతుంది. కానీ ఇవేమీ ఇప్పుడు ఓ అగ్ర హీరో సినిమా విషయంలో జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా ఒకటి రిలీజ్ కు రెడీ అయింది. విడుదల తేదీ దగ్గర పడుతోంది కానీ.. మినిమమ్ బజ్ రావడం లేదు. ట్రేడ్ సర్కిళ్లలో కానీ.. సినీ వర్గాల్లో కానీ ఆ సినిమా గురించి అసలు ముచ్చట్లే లేవు. అలాంటి ఒక సినిమా వస్తోందన్న సంగతి కూడా సాదారణ ప్రేక్షకులకు తెలియకపోవడం గమనార్హం.
అభిమానులు సైతం ఆ సినిమా గురించి పట్టించుకోకపోవడమే అందరికీ షాకింగ్ గా ఉంది. ఏదో చిన్న మీడియం రేంజ్ హీరో సినిమా లేదా చిన్న బ్యానర్ లో రూపొందిన సినిమా అయ్యుంటే.. సరేలే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఉంది టాలీవుడ్ లోని బిగ్ స్టార్. అందుకే ఆ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ సినిమా మీద ఇంత ప్రతికూలత ఎలా వచ్చింది? ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? అనేది ఎవ్వరికీ సరిగ్గా అర్థం కావడం లేదు. మేకర్స్ సరైన విధంగా పబ్లిసిటీ చేయకపోవడం.. జనాల దృష్టిని ఆకర్షించకపోవడమే దీనికి కారణాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ హీరో గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడం.. ప్రమోషనల్ కంటెంట్ నెటిజన్లకు ట్రోలింగ్ స్టఫ్ గా మారడం కూడా కారణమని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి హీరో సైతం ఆసక్తి చూపకపోతే.. జనాలు ఏ విధంగా ఆకర్షితులు అవుతారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
స్టార్ హీరో సినిమా కావడం.. ప్రొడ్యూసర్స్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు మార్కెటింగ్ లో బిజీగా వుండడం.. ఇలా పలు కారణాల వల్ల ప్రమోషన్స్ చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా మేకర్స్ తీరుతో ఫ్యాన్స్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. హైప్ క్రియేట్ చేయడానికి రాబోయే రోజుల్లో అగ్రిసివ్ గా నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
పాటలు మరియు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు టీమ్ తో కలిసి ఇంటర్వ్యూలు రికార్డ్ చేసి మీడియా మరియు సోషల్ మీడియాలో వదలాలని చూస్తున్నారు. అగ్ర హీరో మినహా మిగతా టీమ్ అంతా న్యూస్ ఛానల్స్ మరియు యూట్యూబ్ కు సెపరేట్ గా ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది.
వీటితో పాటుగా రెండు భారీ ఈవెంట్స్ కూడా చేయడానికి మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. అప్పటి వరకూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టారు. ఇవన్నీ సినిమాకు బజ్ తెచ్చిపెడతాయని ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.