Begin typing your search above and press return to search.
పాపం ఆ హీరోకు మళ్లీ అదే ఫలితం
By: Tupaki Desk | 13 Feb 2022 3:57 AM GMTఅక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కమర్షియల్ గా నిలదొక్కుకోలేక పోతున్నాడు. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో సుమంత్ చేసిన సినిమాలు చాలానే ఉన్నా సక్సెస్ లు మాత్రం చాలా తక్కువ. అయినా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వస్తున్నాయి. ఆమద్య వచ్చిన మళ్లీ రావా సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుని వసూళ్లు కూడా పర్వాలేదు అనిపించుకుంది.
ఆ తర్వాత మళ్లీ సుమంత్ కు బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతూనే ఉంది. వరుస ప్లాప్ లతో సినిమాల సంఖ్య తగ్గించి మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ చేస్తూ వస్తున్నాడు. అయినా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. తాజాగా సుమంత్ నుండి వచ్చిన 'మళ్లీ మొదలైంది' సినిమా కు కూడా నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి. సుమంత్ హీరోగా నైనా గంగూలీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.
ప్రముఖ ఓటీటీ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన సినిమా కు ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. పైగా సుమంత్ ఇలాంటి కాన్సెప్ట్ లను ఎందుకు కమిట్ అవుతాడో అర్థం కావడం లేదు అంటూ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
సుమంత్ ఈ సినిమా ను విడాకుల నేపథ్యం అంటూ దర్శకుడు చెప్పిన వెంటనే కమిట్ అయ్యాడట. కాని ఈ సినిమా ఫలితం మాత్రం నిరాశ పర్చింది. విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు.. విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఇద్దరి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది సమాజంలో వారి గురించి జనాలు ఏం అనుకుంటారు అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
మళ్లీ రావా సినిమా తో సక్సెస్ దక్కించుకున్నాడు కనుక మళ్లీ అనే సెంటిమెంట్ తో ఖచ్చితంగా సుమంత్ కు సక్సెస్ దక్కుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా మళ్లీ గత చిత్రాల అనుభవమే సుమంత్ కు దక్కింది. హీరోగా ఎన్నో ప్లాప్ లు మూట కట్టుకున్న సుమంత్ మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అనగనగా ఒక రౌడీ అనే సినిమా లో ప్రస్తుతం సుమంత్ నటిస్తున్నాడు.
ఆ సినిమా లో సుమంత్ లుక్ విభిన్నంగా కనిపిస్తుంది. కనుక ఆ సినిమా అయినా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుందేమో చూడాలి. మళ్లీ మొదలైంది సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం మంచిది అయ్యింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ రిలీజ్ వల్ల నిర్మాతకు కొంతలో కొంత అయినా లాభం దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.