Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ కోసం బోల్డ్‌ బ్యూటీతో చర్చలు?

By:  Tupaki Desk   |   1 Feb 2022 9:30 AM GMT
మెగాస్టార్‌ కోసం బోల్డ్‌ బ్యూటీతో చర్చలు?
X
మెగాస్టార్‌ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య విడుదలకు ముందే చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్ మూవీ లూసీఫర్‌ ను గాడ్‌ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. మోహన రాజా దర్శకత్వంలో ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.. దాదాపుగా సగం వరకు గాడ్‌ ఫాదర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తమిళ్ వేదాళం సినిమా ను కూడా చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్‌ అనే టైటిల్‌ తో ఆ రీమేక్ రూపొందుతుంది. ఇక బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా పట్టాలెక్కింది. ఆచార్య విడుదలకు ఉండగా ఈ మూడు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాను చిరంజీవి కన్ఫర్మ్‌ చేశారు.

చిరంజీవి తో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్ ను వెంకీ కుడుముల చేసేందుకు స్క్రిప్ట్‌ సిద్దం చేశాడు. ఈ సినిమా కోసం యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్ ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా మరో హీరోయిన్‌ పేరు కూడా ప్రచారం జరుగుతోంది. శృతి హాసన్ ఎంపిక అయ్యిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.. కాని తాజాగా మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ అమ్మడు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో మరీ బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు షేర్‌ చేసిన బికినీ ఫొటోలు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలను తలదన్నేలా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతటి అందాల వింధు చేస్తున్న మాళవిక మోహన్‌ ను చిరంజీవి సినిమాలో నటింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మెగాస్టార్‌ చిరంజీవి కి జోడీగా ఈ బోల్డ్‌ బేబీని ఎంపిక చేసే ఉద్దేశ్యంతో దర్శకుడు వెంకీ కుడుముల ఉన్నాడా అంటే ఔను అనే సమాధానం బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే మాళవిక మోహన్ తమిళం మరియు హిందీలో పలు సినిమాలు చేసింది. ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడు సూపర్‌ స్టార్‌ విజయ్ కి జోడీగా మాస్టర్ సినిమా లో నటించి మెప్పించింది.

రజినీకాంత్‌ సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు ఆకట్టుకుంది. వయసుతో సంబంధం లేదు అన్నట్లుగా ఈ అమ్మడు సందర్బాన్ని బట్టి రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తుంది. అయితే సినిమాలో మాత్రం పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయి వయసు కనిపించకుండా ఏ వయసు హీరోకు జోడీగా ఆ వయసు లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కనుక చిరంజీవికి జోడీగా కూడా ఈమె బాగా సూట్‌ అవుతుందని అంటున్నారు. ఈ విషయమై దర్శకుడు వెంకీ కుడుముల మరింత క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.