Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరిని వరస్ట్‌ కో స్టార్స్‌ అనేసింది

By:  Tupaki Desk   |   21 Nov 2019 12:02 PM IST
వాళ్లిద్దరిని వరస్ట్‌ కో స్టార్స్‌ అనేసింది
X
ఇండస్ట్రీలో నిర్మొహమాటంగా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌ నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల వారి కెరీర్‌ కే దెబ్బ పడే అవకాశం ఉందని.. వారు చాలా విషయాలను మనసులోనే ఉంచుకోవాల్సి ఉంటుందనే టాక్‌ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఆమద్య తాప్సి సౌత్‌ సినిమాలపై కామెంట్‌ చేసింది. ఏకంగా రాఘవేంద్ర రావుపై కామెంట్స్‌ చేయడంతో ఆమెకు ఇక్కడ ఆఫర్లే కరువయ్యాయి.

సౌత్‌ లో ఆఫర్లు తగ్గినా కూడా బాలీవుడ్‌ లో ఈ అమ్మడు దూసుకు పోతుంది. వరుసగా ఈమెకు ఆఫర్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆమెకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే దక్కుతున్నాయి. పింక్‌ చిత్రంతో తాప్సి కెరీర్‌ టర్న్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈమె చాలా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఈమె ప్రముఖ స్టార్‌ నేహా దుఫియా నిర్వహించే టాక్‌ షో నో ఫిల్టర్‌ నేహా లో పాల్గొని తన మనసులోని విషయాలను నిర్మొహమటంగా చెప్పేసింది.

టాక్‌ షోలో నేహా నీ కెరీర్‌లో వరస్ట్‌ కో స్టార్స్‌ ఎవరు అంటూ తాప్సిని ప్రశ్నించింది. అందుకు తాప్సి తడుముకోకుండా జాక్వాలిన్‌ ఫెర్నాండెజ్‌ మరియు విక్కీ కౌశల్‌ అంటూ చెప్పింది. జాక్వాలిన్‌ తో కలిసి నటించే సమయంలో ఆమె అంత అంతంగా కనిపించేందుకు, గ్లామర్‌గా కనిపించేందుకు చాలా కష్టపడ్డాను. అందుకే ఆమె నాకు వరస్ట్‌ కో స్టార్‌ అయ్యింది. ఇక విక్కీ కౌశల్‌ కూడా నాకు వరస్ట్‌ కోస్టార్‌ అంది. ఎందుకంటే ఆయనతో నటించడం చాలా కష్టం. అందుకే ఆయన నా వరస్ట్‌ కో స్టార్‌ అంటూ చెప్పుకొచ్చింది. వరస్ట్‌ కో స్టార్స్‌ ను కూడా ఇంత పాజిటివ్‌ గా చెప్పడం ఈ అమ్మడికే సాధ్యం అయ్యింది.