Begin typing your search above and press return to search.

హాట్‌ సింగర్‌.. అవాక్కయ్యేలా చేసింది

By:  Tupaki Desk   |   20 July 2015 12:11 PM IST
హాట్‌ సింగర్‌.. అవాక్కయ్యేలా చేసింది
X
దేవీ శ్రీ ప్రసాద్‌ ఆస్తాన గాయనిగా అందరి మనుసల్ని దోచిన సింగర్‌ నేహా బాసిన్‌. ఈ భామ అప్పట్లో 1నేనొక్కడినే, ఊసరవెల్లి వంటి సినిమాల్లో అదిరిపోయే ఎనర్జిటిక్‌ సాంగ్స్‌ పాడింది. ఆవ్‌ తుజే మోఘ్‌ కర్‌ తా అంటూ 1నేనొక్కడినేలో హస్కీ వాయిస్‌ తో అదరగొట్టేసింది. నీహారిక నీహారిక అంటూ ఊసరవెల్లి లో గుండెల్ని చిదిమేసే పాటని పాడి వినిపించింది. అంతేనా ఈ భామ దేవీశ్రీ మ్యూజిక్‌ లో బోలెడన్ని పాటలు పాడింది. ఎన్టీఆర్‌ తాజా సినిమాలోనూ పాడబోతోంది. అయితే నేహ ఉన్నట్టుండి కనీవినీ ఎరుగని ఓ న్యూలుక్‌ తో నిర్ఘాంతపోయేలా చేసింది.

ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌ కోసం బికినీ వేసి కళ్లు చెదరగొట్టింది. బికినీ లో నేహ ర్యాంప్‌ వాక్‌ మతి చెడగొట్టింది. అసలే లింగరీ డ్రెస్‌.. అటుపై తీర్చిదిద్దిన ఐబ్రోస్‌, గోధుమ వర్ణం హెయిర్‌ కలర్‌ తో అసలు ఈవిడ ఆవిడేనా? విదేశాల నుంచి దిగొచ్చిందా? అన్నంత షాక్‌ ఇచ్చింది. మర్లిన్‌ మన్రో కి జెరాక్స్‌ కాపీలా, లేడీగాగాకి గారాల చెల్లెమ్మలా కనిపించింది. అంతేకాదు మైకు పట్టి కొన్ని ఇంగ్లీష్‌ సాంగ్స్‌ పాడింది. ఇంతవరకూ ఇండియన్‌ హిస్టరీ లో ఓ లేడీ సింగర్‌ ఈ రేంజులో రెచ్చిపోవడం అనేది లేనేలేదు. జెన్నీఫర్‌ లోపెజ్‌, బ్రిట్నీ స్పియర్స్‌ తరహాలో కేవలం నేహా ఒక్కత్తే ఆ ఫీట్‌ చేయగలిగింది. ఇకపోతే ఆమె సింగింగ్‌ టాలెంట్‌ కంటే ఈ బికినీ లుక్‌ కే ప్రేక్షకులు పడిపోతున్నారు.