Begin typing your search above and press return to search.

లైంగికదాడులు నాకు కొత్తకాదు.. ఒకడైతే గుడిలోనే.. గాయని సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:50 AM GMT
లైంగికదాడులు నాకు కొత్తకాదు.. ఒకడైతే గుడిలోనే.. గాయని సంచలన ఆరోపణలు
X
బాలీవుడ్ గాయని నేహా భాసిన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అనేకసార్లు లైంగికదాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తన జీవితంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను వివరించారు..

ఆమె ఏం చెప్పారంటే.. ‘ లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచే నేను ఇటువంటి ఎదర్కొన్నాను. పదేళ్ల వయసులో ఓ సారి హరిద్వార్​ వెళ్లాను. అక్కడ ఓ అబ్బాయి .. నా మర్మాంగంలో తన వేలిని గుచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయా.

కొన్నేళ్ల తర్వాత మళ్లీ హరిద్వార్​ టెంపుల్ లోనే ఓ యువకుడు వచ్చి నా బ్రెస్ట్​ను గట్టిగా పట్టుకున్నాడు. ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. నా తప్పు ఏమి లేకుండానే నా జీవితంలో ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయి. ’ అని నేహా చెప్పారు. ‘ ఇప్పటికీ కొందరు నన్ను సోషల్​మీడియాలో వేధిస్తున్నారు. నాకు అసభ్యకరంగా మెసేజ్​లు పెడుతుంటారు. కొందరైతే కామెంట్లు పెడతారు. నా ఒంటి గురించి, డ్రెస్సుల గురించి తప్పుడు రాతలు రాస్తారు. వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా. సోషల్ మీడియాలో నాకు ఇటీవల బెదిరింపులు వచ్చాయి. కొందరు చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ' అని చెప్పారు.

నేహా తెలుగులోనూ కొన్ని పాటలు పాడారు.
కరెంట్ చిత్రంలో ‘అటు నువ్వే.. ఇటు నువ్వే’ దడ చిత్రంలో ‘హల్లో హల్లో’, ఊసరవెళ్లిలో ‘నిహారిక నిహారిక’ నువ్వా నేనా చిత్రంలో.. థ థ తమారా, నేనొక్కడినే చిత్రంలో ఆవ్ తుజో మోగ్ కార్టా, జనత గ్యారేజ్లో యాపిల్ బ్యూటీ, జై లవకుశలో స్వింగ్ జరా పాటను పాడారు. ఆ పాటలు తెలుగులో హిట్​ అయ్యాయి.