Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కి పాప పుట్టిందోచ్!

By:  Tupaki Desk   |   18 Nov 2018 10:48 AM GMT
ఆ హీరోయిన్ కి పాప పుట్టిందోచ్!
X
బాలీవుడ్ హీరోయిన్.. హోస్ట్ అయిన నేహా ధూపియా మే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే నేహా గర్భం దాల్చిన కారణంగా హడావుడిగా ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆగష్టులో తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నేహా కన్ఫాం చేసింది.

ఇక ప్రెజెంట్ కి వస్తే నేహా ఈరోజు ఉదయం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. నేహా తరపున ఆమె పబ్లిసిస్ట్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబై లోని వుమన్స్ హాస్పిటల్ లో డెలివరీ జరిగిందని.. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ జంట హడావుడి పెళ్ళిపై వచ్చిన వార్తలన్నీ నిజమయ్యాయి. కొంతమంది అభిమానులు ఇద్దరినీ వెనకేసుకొస్తూ పెళ్ళి లేట్ గా చేసుకుంటే తప్పేమీ లేదని.. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. పెళ్ళితో ఒకటయ్యారు.. ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.. వారి వల్ల ఎవరికీ నష్టం లేదు కదా అంటున్నారు.

సరే.. ఇలాంటివి ఎప్పుడూ ఉండేవే కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇలాంటి శుభసందర్భంలో నేహా - అంగద్ జంటకు బాలీవుడ్ కొలీగ్స్ నుండి.. అభిమానులనుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.