Begin typing your search above and press return to search.
ధూపియా బేబి బంప్ డిస్ ప్లే
By: Tupaki Desk | 25 Aug 2018 5:07 PM GMTనేహాధూపియా .. ఈ పేరు వినగానే వెంటనే `జూలీ` సినిమా గుర్తుకొస్తుంది. ముంబై ర్యాంప్ నుంచి వచ్చిన టాప్ మోడల్ గా నేహా ఆ సినిమాలో చెలరేగిన తీరు కుర్రకారుకు కంటిమీద కునుకుపట్టనివ్వలేదు ఆరోజుల్లో. ఆ స్థాయిలో ఎలాంటి మొహమాటం లేకుండా జూలీ పాత్రలో నటించిన నేహా ఆ తర్వాత బాలీవుడ్ లో ఎదురేలేకుండా దశాబ్ధం పైగానే కెరీర్‌ని సాగించింది. ఆ క్రమంలోనే టాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. తెలుగులో బాలకృష్ణ సరసన పరమ వీర చక్ర చిత్రంలో నటించింది. ఆ టైమ్ లోనే నేహా ధూపియా అప్పియరెన్స్ - పెర్ఫామెన్స్ గురించి దర్శకరత్న దాసరి ఓ రేంజులో పొగిడేశారు.
అదంతా గతం అనుకుంటే - వర్తమానంలో నేహాధూపియా పూర్తిగా వేరు. మొన్న మేలో సైలెంటుగా తన బోయ్ ఫ్రెండ్ అంగాద్ భేడీని పెళ్లాడేసి ఓ ఇంటిదైంది. అంతకుముందే ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం గురించి బాలీవుడ్ మీడియా కోడై కూసింది. మొత్తానికి ఈ జోడీ పండంటి బిడ్డను కనేసేందుకు రెడీ అవుతున్నారు. నేహా బేబి బంప్ గురించి గత కొంతకాలంగా ఆసక్తికరంగా చర్చ సాగుతున్నా.. ఆ విషయంలోనూ సైలెన్స్ ని మెయింటెయిన్ చేసింది ఈ జోడీ.
లేటెస్టుగా ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా బేబి బంప్ ప్రదర్శన జరిగింది. నేహా ర్యాంప్ పై భర్త అంగాద్ తో కలిసి వాక్ చేసి అభిమానులకు బేబి బంప్‌ని ప్రదర్శించింది. ర్యాంపుపై ఈ జోడీ చూడముచ్చటగా కనిపించారు. పైగా ఒకే కాంబినేషన్ ఫ్లోరల్ డిజైనర్ డ్రెస్ లో తళుక్కుమని మెరిశారు. పాపా.. బాబా? అన్నది అటుంచితే ఈ జంటపైనే ఫ్యాషన్ వీక్ లో కళ్లన్నీ!