Begin typing your search above and press return to search.

నేహా నువ్వు చేసింది పెద్ద తప్పు: అభిమానులు ఫైర్

By:  Tupaki Desk   |   13 March 2020 5:37 PM IST
నేహా నువ్వు చేసింది పెద్ద తప్పు: అభిమానులు ఫైర్
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియాకు రీసెంట్ గా చేదు అనుభవం మిగిలింది. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ సెలబ్రిటీ అయినా మీడియా బారిన పడాల్సిందే. నేహాధూపియా బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ గ్లామరస్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది.

పెళ్లి చేసుకున్న తర్వాత 'నో ఫిల్టర్ విత్ నేహా' టీవీ ప్రోగ్రామ్ తో మంచి గుర్తింపును పొందింది. ప్రస్తుతం 'రోడీస్ రెవెల్యూషన్' ప్రాగ్రాంలో ఒక సమస్యను కొని తెచ్చుకుంది. ప్రోగ్రాంలో పోటీచేసిన ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ వల్ల తనకు జరిగిన మోసాన్ని గురించి వివరించాడు. తన గర్ల్ ఫ్రెండ్ తనతో రిలేషన్ షిప్ లో ఉండగానే వేరే వాళ్ళతో డేటింగ్ చేసిందని, అందుకే కొట్టాల్సి వచ్చిందని వాపోయాడు.

ఆ వెంటనే నేహా అందుకొని అతడిని నోటికొచ్చినట్లు తిట్టేసింది. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవడితో తిరిగితే నీకేంటి? ఎంతమందితో డేటింగ్ చేస్తే నీకేంటి? అసలు ఇవన్నీ అడగడానికి నువ్వెవడివి.. అంటూ కొంచం ఘాటుగా అసభ్యకర పదాలతో దూషించింది. అంతే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచుకున్నంత పనైంది ఇప్పుడు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో నేహను ట్రోల్ చేయనివారు లేరు. ఆమె చేసింది చాలా తప్పని, ఆ వ్యక్తిని అలా దూషించడం కరెక్ట్ కాదని నేహపై విరుచుకుపడుతున్నారు.