Begin typing your search above and press return to search.

మూడేళ్ల డాట‌ర్ ని చూసి మురిసిపోతున్న మామ్!

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:00 AM IST
మూడేళ్ల డాట‌ర్ ని చూసి మురిసిపోతున్న మామ్!
X
బాలీవుడ్ స్టార్ క‌పుల్స్ నేహాదూపియా- అంగ‌ద్ బేడీ జంట ప్రేమ‌ కానుక‌గా ఇద్ద‌రు పిల్ల‌లు. ప్రోఫెష‌న‌ల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని మాత్రం ఈ జంట అస్స‌లు మిస్ అవ్వ‌దు. స‌మ‌యం దొరికితే వెకేష‌న్లు అంటూ పిల్ల‌ల‌తో విదేశాలు చుట్టేస్తారు. ఆ ల‌వ్ బుల్ క‌పుల్స్ కూడా పాపాయిల్లా మారిపోతారు. ఇన్ స్టా వేదిక‌గా ఆ మూవ్ మెంట్స్ ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటారు. తాజాగా పెద్ద కుమార్తె మ‌హెర్ నేటితో మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా స్వీట్ డాట‌ర్ కి పెట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

రెండ‌వ బిడ్డ క‌డుపులో ఉండ‌గా నేహా ధూపియా మెహ‌ర్ తో క‌లిసి ఉన్న ప్ర‌సూతి ఫోటో షూట్ ఫోటోని పోస్ట్ చేస్తూ ఇలా అంది. మూడేళ్ల క్రితం ఇదే రోజు ఉద‌యం 11.25 గంట‌ల‌కు నా శ‌రీరానికి అవ‌ల నాగుండె కొట్టుకోవ‌డం ప్రారంభించింది. నా బంగారు త‌ల్లి నీకు పుట్టిన రోజు శుభాకాంక‌క్ష‌లు. ప్రేమ అంటే ఏంటో నువ్వే అంద‌రికీ నేర్పించావు. నువ్వొక అద్భుతం. నాకు మాట‌లు రావ‌డం లేదు త‌ల్లి అంటూ కుమార్తెపై ప్రేమ‌ను కురిపించింది ఆ అంద‌మైన మామ్. నేహా ధూఫియా దంప‌తుల‌కు 2018లో మెహ‌ర్ జ‌న్మ‌నిచ్చింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో నేహా రెండ‌వ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

కాగా పెద్ద కుమార్తె పుట్టిన రోజు సంద‌ర్భంగా బిడ్డ‌ల‌తో క‌లిసి ఉన్న ఫోటోల్ని..భ‌ర్త‌తో ఉన్న ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి సినిమాల‌కు దూరంగా ఉంది. ప్ర‌స్తుతం `ఏ థ‌ర్స్ డే` అనే సినిమా లైనప్ లో ఉంది. కానీ షూటింగ్ డిలే అవుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. అలాగే నేహా ధూపియా న‌టించిన `స‌నాక్ అనే చిత్రం ఈ అక్టోబ‌ర్ లో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా పెద్ద స‌క్సెస్ కాలేదు.