Begin typing your search above and press return to search.

విలన్ భామ పెళ్లి చేసేసుకుందోచ్

By:  Tupaki Desk   |   10 May 2018 11:15 AM GMT
విలన్ భామ పెళ్లి చేసేసుకుందోచ్
X
బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా.. బాలనటిగా కాకుండా తెరంగేట్రం చేసినది తెలుగు సినిమాతోనే. నిన్నే ఇష్టపడ్డాను అంటూ తరుణ్ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇంకా బాలీవుడ్ లో కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉంది.

మధ్యలో విలన్ అంటూ తెరకెక్కిన రాజశేఖర్ మూవీలోను.. ఆ తర్వాత పరమ వీర చక్ర అంటూ బాలకృష్ణ సినిమాలోను హీరోయిన్ గా నటించిన నేహా ధూపియా.. ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసేసుకుని షాక్ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు అంగద్ బేడీతో కొంతకాలంగా ఈమె డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవాలు తెలిసేలోపలే పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించేసింది నేహా ధూపియా. ఇతడు ఎవరో కాదు.. మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు.

బాలీవుడ్ లో ఓ నాలుగేళ్లుగా ఇతడు సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు. ఇంతకీ వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు అనే కదా డౌట్. ఇలా పెళ్లి చేసుకుందో లేదో.. అలా తమ ఇద్దరి జంటకు సంబంధించిన ఓ పిక్ ను నెట్ లో పోస్ట్ చేసేసింది నేహా ధూపియా. 'నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం.. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నాను. నా భర్తను చూడండి' అని చెప్పింది నేహా ధూపియా. 'నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా భార్య. ఇదుగో మిసెస్ బేడీ' అన్నాడు అంగద్ బేడీ.