Begin typing your search above and press return to search.
వల్గారిటి అనేది చూసే కళ్ళను బట్టే..
By: Tupaki Desk | 15 Dec 2017 11:00 AM GMTఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలు వేసే డ్రెస్ లు చాలా వల్గర్ గా ఉన్నాయని బయట కూడా అలాంటి డ్రెస్ లు వేసుకొని తిరిగితే రేప్ లు ఎక్కువగా జరుగుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు హాట్ బ్యూటీ నేహా ధూపియా తనదైన శైలిలో కౌంటర్ వేసింది. అంతే కాకుండా పోరాడితే తాను కూడా పోరాటంలోకి భాగం అవుతాను అంటోంది.
ఆరేళ్ల పసి పాపల నుంచి ఆరు పదుల వయసు దాటినా వృద్ధ మహిళలు కూడా ఈ ప్రపంచంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిపైనే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వేసే డ్రెస్ కారణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఎలా చెప్పగలరు అని ప్రశ్నించింది. అందంగా కనిపించడం లో తప్పులేదు. అందం ఆత్మవిశ్వాసానికి బలం. అది వల్గర్ గా ఉందా లేదా అన్నది చూసే కళ్లను బట్టి ఉంటుందని తెలిపింది. అంతే కాకుండా పురుషాధిక్య ప్రపంచంలో నేను కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాను.
అయితే వారిని గురించి పట్టించుకుంటే కెరీర్ పై ఏకాగ్రతను కోల్పోతానేమో అని లైట్ తీసుకున్నానా అని వివరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఇబ్బందులను ఎదుర్కొంటే..మహిళలు వెంటనే ఫైర్ అవుతున్నారు. దైర్యంగా బయటకు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు చాలా పెరిగిపోతున్నాయి. దీంతో మహిళలు ఏ మాత్రం భయపడకుండా బయటకు చెబుతున్నారు. ఇలానే అందరు దైర్యంగా ఉండాలని నేహా ధూపియా తెలిపింది.