Begin typing your search above and press return to search.
స్కాచ్ కరెక్ట్ అంటున్న మిస్ ఇండియా
By: Tupaki Desk | 31 March 2016 9:00 PM ISTచాలామంది స్టార్లు - సెలబ్రిటీలు బ్రాండ్ అండార్స్ మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ కొందరు మాత్రం తమకు ముట్టే భారీ రెమ్యూనరేషన్ కు ఓకే అయిపోయి... ఏ బ్రాండ్ కైనా ప్రచారం చేసేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రచారాల ద్వారా అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ బ్రాండ్స్ కు ప్రచారం చేసే స్టార్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటివరకూ చాలామంది మేల్ స్టార్స్ ఇలాంటి యాడ్స్ లో కనిపించారు.
ఇఫ్పుడు మాజీ మిస్ ఇండియా కూడా ఓ లిక్కర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా చేయడం ప్రారంభించింది. యాడ్స్ చేయడమే కాకుండా.. తన పర్సనల్ సోషల్ నెట్వర్కింగ్ పేజ్ ను కూడా ఈ ప్రచారానికి వాడేసుకుంటోంది నేహా ధూపియా. 'మగవాళ్లకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఎప్పుడూ పెద్ద ప్రాబ్లెమే. నేనైతే వారికి స్కాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇష్టపడతాను' అంటూ నేహా ధూపియా చేసిన ట్వీట్ బాలీవుడ్ లో సంచలనం అయింది. ఇదంతా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారమే అని తెలిసినా... ఓ మహిళ అయుండి ఇంత ఓపెన్ గా స్కాచ్ విస్కీ గురించి పబ్లిసిటీ చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.
షారూక్ ఖాన్ - మహేష్ బాబు - రవితేజ లాంటి స్టార్లు కూడా మ్యూజిక్ సీడీల పేరుతో ఇలాంటి ప్రచారాలు చేయడం ఆడియన్స్ చూశారు. ఇప్పుడీ కోవలోకి నేహధూపియా కూడా చేరపోయింది. అన్నట్లూ.. ఈ భామ రాజశేఖర్ సరసన తెలుగులో 'విలన్' అనే మూవీలో హీరోయిన్ గా కూడా నటించింది.