Begin typing your search above and press return to search.

అక్కా చెల్లెళ్ల క‌ష్టం క‌రోనా అయినా త‌ట్టుకోలేదు!

By:  Tupaki Desk   |   24 March 2020 5:30 PM GMT
అక్కా చెల్లెళ్ల క‌ష్టం క‌రోనా అయినా త‌ట్టుకోలేదు!
X
నేహా శ‌ర్మ‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. చిరుత సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ అటుపై బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ ముంబై ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమిత‌మైంది. మొద‌టి సినిమా త‌ర్వాత‌ చాలా కాలం అస‌లు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌యిన ఈ అమ్మ‌డు అటుపై ఉన్న‌ట్టుండి బాలీవుడ్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ మాత్రం వ‌రుస‌గా సినిమాల్లో న‌టించేసింది. అందులో కొన్ని హిట్లు మ‌రికొన్ని ఫ‌ట్లు కావ‌డంతో కెరీర్ అంతంత మాత్రంగానే సాగింది.

ఇక ఇటీవ‌ల సోషల్ మీడియా యుగం మొద‌ల‌య్యాక నేహా రెగ్యుల‌ర్ గా ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటోంది. ఇక్క‌డ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో గంగ‌వెర్రులెత్తిస్తోంది. టైమ్ చూసి టైమింగ్ తో సామాజిక వీరంగమాడుతూ బికినీలో .. టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్సుల్లో అగ్గి రాజేస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా హాలీడేస్ నేప‌థ్యంలో శ‌ర్మాగాళ్ మ‌రోసారి నెటిజ‌నుల‌పై విరుచుకుప‌డింది.

ఇంటి నుంచే వ‌ర్క‌వుట్లు చేస్తున్నా. వ‌ర్క‌వుట్ మోటివేష‌న్.. ఇన్ ది టైమ్స్ ఆఫ్ క‌రోనా.. హోమ్ బౌండ్! అంటూ ఓ వీడియోని నేహాశ‌ర్మ షేర్ చేసింది. ఈ వీడియోలో త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌తో పాటు డంబెల్స్ ఎత్తుతూ ఉన్న‌ప్ప‌టి వీడియోని శ‌ర్మా గాళ్ షేర్ చేసింది. శ‌ర్మా సిస్ట‌ర్స్ మ‌రీ ఇంత అతి చేయాలా? ఎక్స‌ర్ సైజులు పేరుతో సైజుల షోలు వేయాలా? మ‌రీ ఇంత‌గా సిమాలేమిటి? అంటూ కాస్త తీవ్ర‌మైన కామెంట్ల‌తోనే నెటిజ‌నం విరుచుకుప‌డుతున్నారు. ఇక్క‌డ సోష‌ల్ మీడియా ప‌క్షుల‌కు కావాల్సిన‌దే సిస్ట‌ర్స్ చేసారు. కానీ కామెంట్లు మాత్రం విన‌క‌ త‌ప్ప‌డం లేదు మరి. నేహాశ‌ర్మ ఇటీవ‌లే తానాజీలో క‌నిపించింది. ఆ సినిమా హిట్ట‌య్యింది. ప్ర‌స్తుతం థైస్ అనే చిత్రంతో పాటు ఓ పంజాబీ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఐషా శ‌ర్మ‌కు అవ‌కాశాలు ర‌ప్పించేందుకు సిస్ట‌ర్ నేహా ఇదిగో ఇలా తంటాలు ప‌డుతోంది. అయితే ఛాన్సులొచ్చేది త‌క్కువే మ‌రి.