Begin typing your search above and press return to search.
ఆస్కార్ బరిలో చరణ్ హీరోయిన్!?
By: Tupaki Desk | 4 Nov 2016 1:30 AM GMTరామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ అరంగేట్రం చేసింది నేహాశర్మ. ఆ తర్వాత మెల్లగా తన బేస్ ను బాలీవుడ్ కి మార్చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగు సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాలీవుడ్ సినిమాలను బాగానే పట్టేస్తున్న ఈ భామ.. సడెన్ గా ఆస్కార్ రేస్ లో నిలబడ్డం షాక్ కొట్టించే సంగతే.
నేహా శర్మ ఇటు హిందీ సినిమాలు చేస్తూనే.. ఈ మధ్య ఓ చైనీస్ మూవీ కూడా చేసేసింది. 'క్సువాన్ జాంగ్' అనే టైటిల్ పై రూపొందిన ఈ మూవీలో.. సోనూ సూద్ కూడా కీలక పాత్ర పోషించగా.. ఈ ఏడాది రిలీజ్ అయిన చైనీస్ పిక్చర్స్ లో నేహా మూవీకి మంచి ఆదరణ దక్కడంతో పాటు బోలెడన్ని ప్రశంసలు కూడా వచ్చి పడ్డాయి. అందుకే ఈ క్సువాన్ జాంగ్ ను.. ఆస్కార్ పోటీకి ఎంపిక చేశారు. బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరిలో ఈ మూవీ పోటీ పడనుండగా.. ఈ చైనీస్ పిక్చర్ కి ఆస్కార్ దక్కించుకునే అర్హత ఉందన్నది చాలామంది చెబుతున్న మాట.
7వ శతాబ్దంలో చైనా నుంచి ఇండియాకు ప్రయాణించిన ఓ బౌద్ధ మత గురువు కథే ఈ మూవీ. ఈయన ప్రయాణానికి 17 ఏళ్లు పట్టగా.. ఆ కాలం నాటి విజువల్స్ ను అద్భుతంగా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఒక వేళ క్సువాన్ జాంగ్ కు కానీ ఆస్కార్ దక్కిందంటే మాత్రం.. చెర్రీ హీరోయిన్ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవేమో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/