Begin typing your search above and press return to search.
12 ఏళ్ల తర్వాత డెబ్యూ నాయికగా?
By: Tupaki Desk | 1 Aug 2019 6:14 AM GMT28 సెప్టెంబర్ 2007 .. `చిరుత` రిలీజైన తేదీ. దాదాపు 12ఏళ్లయ్యింది. ఈ దశాబ్ధ కాలంలో రామ్ చరణ్ 200 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. 100 కోట్ల షేర్ తెచ్చే హీరోగా ఎదిగాడు. కానీ ఆ సినిమాలో నటించిన కథానాయిక నేహా శర్మ మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంది. కథానాయికలకు రంగుల ప్రపంచంలో ఈదడం అంత సులువేం కాదు! అనడానికి తనే పెద్ద ఎగ్జాంపుల్. పెద్ద స్టార్ వారసుడి సరసన కథానాయికగా పరిచయం అయినా అనుకున్నది సాధించలేకపోయింది. టాలీవుడ్ లో అసలు ఈ అమ్మడికి అవకాశాలే రాలేదు ఎందుకనో. అసలు సౌత్ లోనే ఈ ముంబై గాళ్ కుదురు కోలేకపోయింది.
ఇటీవలే వచ్చిన అదాశర్మ లాంటి నాయికనే తెలుగులో క్రేజీగా అరడజను పైగా చిత్రాల్లో నటించింది. ఇరుగు పొరుగు భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. అటుపై వచ్చిన హెబ్బా పటేల్ లాంటి భామ కూడా టాలీవుడ్ లో నిరంతరం ఉనికిని చాటుకుంటోంది. బాలీవుడ్ తర్వాత అంత పెద్ద పరిశ్రమగా తెలుగు పరిశ్రమకు గుర్తింపు ఉంది. ఇలాంటి చోట నేహా శర్మకు ఛాన్సే లేదా? అంటే ఆశ్చర్యకరమే.
అయితే ఈ డైలెమా నుంచి బయటపేడేందుకు చిరుత గాళ్ నేహా చేయని ప్రయత్నమే లేదు. 2018లో బికినీ బీచ్ సెలబ్రేషన్ పేరుతో వరుసగా ఫోటోషూట్లు చేసి అంతర్జాలంలో పిచ్చెక్కించింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులను షేక్ చేసింది. కానీ అది కూడా ఫలించినట్టు కనిపించలేదు. ప్రస్తుతం పంజాబీలో ఓ చిన్న సినిమా చేసేందుకు ఈ అమ్మడు కమిటైందట. ``కొత్త జర్నీ మొదలెట్టాను. పంజాబీల ప్రేమకు సంతోషంగా ఉంది!`` అంటూ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఈ మాత్రం అవకాశం కోసం అంత ఆత్రంగా వేచి చూసిందా పాపం!? దాదాపు పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఒక డెబ్యూ నాయికగా పంజాబీలో అడుగు పెట్టింది మరి. కనీసం అక్కడైనా ఓ హిట్టొస్తుందా? వచ్చినా అక్కడ పారితోషికాల రేంజ్ టాలీవుడ్ తో పోలిస్తే చాలా తక్కువ. అలాంటప్పుడు ఏం ఉపయోగం? అన్న చర్చా సాగుతోంది.