Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: గాలికి వ‌దిలేసిన అందం

By:  Tupaki Desk   |   27 Jan 2019 4:20 PM GMT
ఫోటో స్టోరి: గాలికి వ‌దిలేసిన అందం
X
`చిరుత` గాళ్ నేహాశ‌ర్మ సామాజిక మాధ్య‌మాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా క్వీన్ గా చెల‌రేగుతున్న ఈ బ్యూటీ మ్యాగ‌జైన్ ఫోటో షూట్లు - బికినీ బీచ్ ఫోటోషూట్ల తో వేడెక్కిస్తోంది. ఇన్ స్టాలో పోస్టింగుల‌తో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ముంబై టాప్ మోడ‌ల్ గా నేహా శ‌ర్మ ప‌లు క్రేజీ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తూనే బాలీవుడ్ లో కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ఉంది.

తాజాగా ఇన్ స్టాగ్ర‌మ్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన క్యాజువ‌ల్ ఫోటోస్ యూత్ కి మ‌తిచెడే ట్రీట్ ఇస్తున్నాయి. నేహా త‌న సోద‌రి ఐషా శ‌ర్మ బ‌ర్త్ డే పార్టీలో ఎంతో నేచురల్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. తాను క్యాజువ‌ల్ అనుకున్నా.. ఆ ఫోటోలు సంథింగ్ స్పెష‌ల్ లుక్ తో వేడెక్కిస్తున్నాయి. ఇక మ‌నోజ్ బాజ్ పాయ్ కి పద్మ‌శ్రీ అవార్డు ద‌క్కిన సంద‌ర్భంగా నేహా శ‌ర్మ ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపింది.

నేహా కెరీర్ ప‌రంగా ప‌రిశీలిస్తే ప్ర‌స్తుతం హేరా ఫేరి 3 అనే భారీ సీక్వెల్ చిత్రంలో న‌టిస్తోంది. అక్ష‌య్ కుమార్ - ప‌రేష్ రావ‌ల్ - సునీల్ శెట్టి లాంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంద్ర‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఫిరోజ్ న‌డియావాలా నిర్మిస్తున్నారు. హేరాఫేరి సిరీస్ తొలి చిత్రానికి ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ భారీ సినిమా రిలీజైతే నేహాకి మ‌ళ్లీ భారీ అవ‌కాశాలు ఖాయం అనే భావిస్తున్నారు.